తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన.. మరో 3 రోజులు..
ABN , Publish Date - Apr 04 , 2026 | 07:51 AM
తెలంగాణలో మరో మూడు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్‌లో కూడా కొన్ని ప్రాంతాల్లో వర్షాలు పడే సూచనలు ఉన్నాయని తెలిపింది.
ఇంటర్‌నెట్ డెస్క్: రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎండలు రోజు రోజుకు పెరుగుతూపోతున్నాయి. ఉదయం 8 గంటలనుంచే భానుడి భగభగలు మొదలవుతున్నాయి. ఏపీ, తెలంగాణలోని పలు ప్రాంతాల్లో మధ్యాహ్నం పూట ఎండలు 40 నుంచి 45 డిగ్రీల మధ్య నమోదు అవుతున్నాయి. బయట తిరగాలటే భయపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. వడగాడ్పుల కారణంగా జనం అస్వస్థతకు గురవుతున్నారు. మండే ఎండలతో అల్లాడిపోతున్న జనాలకు భారత వాతావరణ శాఖ ఊరట కలిగించే వార్త చెప్పింది. రెండు తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని అంది.
తెలంగాణలో మరో మూడు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ద్రోణి, ఆవర్తన ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. శని, ఆది సోమవారాల్లో ఉమ్మడి నిజామాబాద్, కరీంనగర్, మెదక్, ఆదిలాబాద్, సంగారెడ్డి, వరంగల్, రంగారెడ్డి, ఖమ్మం, నల్గొండ, హైదరాబాద్ జిల్లాల్లో వర్షాలు పడే సూచనలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది. ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొంది. ఈ మేరకు పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్‌లోని పలు ప్రాంతాల్లో వర్షాలు పడే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ తెలిపింది.
ఇవి కూడా చదవండి
48 గంటల కాల్పుల విరమణ.. అమెరికా ప్రతిపాదనను తిరస్కరించిన ఇరాన్..
శ్రీవారి సర్వదర్శనానికి 10 గంటల సమయం