పాకిస్థాన్ ఆశలు ఫలించేనా.. రెండోసారి వాయిదా పడిన అమెరికా వైస్ ప్రెసిడెంట్ పర్యటన..
ABN , Publish Date - Apr 04 , 2026 | 09:51 AM
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలను అవకాశంగా తీసుకుని అంతర్జాతీయ స్థాయిలో పేరు సంపాదించుకోవాలనుకున్న పాకిస్థాన్ ఆశలపై ఇరాన్ నీళ్లు జల్లింది. ఈ నేపథ్యంలో పాకిస్థాన్‌కు వెళ్లాల్సిన అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ పర్యటన రెండోసారి కూడా వాయిదా పడింది.
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలను అవకాశంగా తీసుకుని అంతర్జాతీయ స్థాయిలో పేరు సంపాదించుకోవాలనుకున్న పాకిస్థాన్ ఆశలపై ఇరాన్ నీళ్లు జల్లింది. ఈ నేపథ్యంలో పాకిస్థాన్‌కు వెళ్లాల్సిన అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ పర్యటన రెండోసారి కూడా వాయిదా పడింది. అమెరికాతో శాంతి చర్చల ప్రసక్తే లేదని, పాకిస్థాన్ మధ్యవర్తిత్వం తమకు అక్కర్లేదని ఇరాన్ తేల్చి చెప్పింది. ఇస్లామాబాద్‌లో చర్చలను ఇరాన్ తిరస్కరించడంతో పాకిస్థాన్‌కు దౌత్య పరంగా ఎదురుదెబ్బ తగిలింది (Pakistan mediation Iran US).
పాక్ మధ్యవర్తిత్వం విఫలం కావడంతో రెండోసారి కూడా జేడీ వాన్స్ తన పర్యటనను వాయిదా వేసుకున్నారు. దౌత్యపరంగా అనిశ్చితితో పాటు భద్రతా పరమైన కారణాలు కూడా జేడీ వాన్స్ పర్యటన వాయిదాకు కారణాలుగా కనిపిస్తున్నాయి. పాకిస్థాన్ మధ్యవర్తిత్వ ప్రతిపాదనకు వాషింగ్టన్ అంగీకరించిందని, గత 10 రోజుల్లో రెండు సందర్భాలలో ఇస్లామాబాద్‌లో చర్చలు జరపడానికి ఇరుపక్షాలు అంగీకరించాయని పాకిస్థాన్ విదేశాంగ మంత్రి ఇషాక్ దార్ పేర్కొన్నారు. అయితే చివరి నిమిషంలో ఇరాన్ వైదొలగడంతో అమెరికా ఉపాధ్యక్షుడి పర్యటన వాయిదా పడిందని అన్నారు (Iran rejects talks Islamabad).
ఇరాన్‌లోని శక్తివంతమైన ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) లోని కొన్ని వర్గాలు ఘర్షణను పొడిగించడానికే మొగ్గు చూపుతున్నాయని ఇషాన్ దార్ అభిప్రాయపడ్డారు (US Iran conflict talks). అమెరికా, ఇజ్రాయెల్‌లతో ఐఆర్‌జీసీ సుదీర్ఘ యుద్ధం కోరుకుంటోందని ఇషాన్ దార్ అన్నారు. దౌత్యపరంగా చర్చలు జరపడానికి ఇరాన్ విముఖత చూపడానికి ఆ దేశంలోని అంతర్గత విభేదాలే కారణమవుతున్నాయని ఆయన అన్నారు. అయితే ఇరాన్ అధినాయకత్వం త్వరలోనే మనసు మార్చుకుంటుందని, పాక్ వేదికగా చర్చలకు అంగీకరిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
ఇవి కూడా చదవండి..
48 గంటల కాల్పుల విరమణ.. అమెరికా ప్రతిపాదనను తిరస్కరించిన ఇరాన్..
స్థిరంగా కొనసాగుతున్న బంగారం, వెండి ధరలు.. ఈ రోజు ఎలా ఉన్నాయంటే..