రాళ్లు విసిరేకొద్దీ రాటుదేలుతా....!
ABN , Publish Date - Apr 01 , 2026 | 10:35 AM
‘నాకు మా యువ నాయకుడు, మంత్రి నారా లోకేశ్ స్ఫూర్తి. ఆయన బాటలోనే నడుస్తా. ఎవరు ఎన్ని రాళ్లు విసిరినా రాటుదేలుతా’ అని అనంతపురం ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వరప్రసాద్ పేర్కొన్నారు.
సామాన్యుల నడుమ టీ స్టాల్లో ఎమ్మెల్యే దగ్గుపాటి
అనంతపురం: ‘నాకు మా యువ నాయకుడు, మంత్రి నారా లోకేశ్ స్ఫూర్తి. ఆయన బాటలోనే నడుస్తా. ఎవరు ఎన్ని రాళ్లు విసిరినా రాటుదేలుతా’ అని అనంతపురం ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వరప్రసాద్ పేర్కొన్నారు. నిత్యం హంగూ ఆర్భాటాలతో కనిపించే ఎమ్మెల్యే మంగళవారం ఉదయం ఎవరూ లేకుండా, సామాన్యుడిలాగా పెద్దాస్పత్రికి వెళ్లారు. అక్కడి రోగుల పరిస్థితిని ఆరా తీశారు. ఆసుపత్రి నుంచి బయటకు వచ్చిన ఆయన ఆదిమూర్తినగర్లోని హౌసింగ్ డిపార్టుమెంట్ వద్ద ఉన్న టీ స్టాల్ వద్ద ఆగారు.
సాధారణ జనంతో పాటు కూర్చోని టీ తాగారు. పిచ్చాపాటి మాట్లాడారు. ఈ క్రమంలోనే కొందరు ‘అన్నా! మీపై లేని పోని విమర్శలు ఈ మధ్య ఎక్కువగా చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ నాపై విపక్షాలు, బయటి వ్యక్తులతోపాటు ఇంట్లో వాళ్లు(పార్టీ)కూడా విమర్శల రాళ్లు విసురుతున్నారన్నారు. ఎన్నిసార్లు, ఎవరు ఎన్ని రాళ్లు విసిరినా అంతే దీటుగా ఎదుర్కొంటానని తెలిపారు. ఉన్నఫలంగా ఎమ్మెల్యే అక్కడికి రావడం, సామాన్యులతో కలిసి పిచ్చాపాటిగా మాట్లాడటం చూసి అటు, ఇటుగా వెళ్లే ఆశ్చర్యం వ్యక్తం చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి:
చిత్తూరులో అదృశ్యమైన మహిళ దారుణ హత్య
Read Latest Telangana News and National News