Share News

చిత్తూరులో అదృశ్యమైన మహిళ దారుణ హత్య

ABN , Publish Date - Apr 01 , 2026 | 09:52 AM

చిత్తూరు జిల్లాలో ఓ మహిళ దారుణ హత్యకు గురైంది. రెండు రోజుల క్రితం చంద్రమ్మ అనే మహిళ కనిపించకుండా పోయింది. పలమనేరు రూరల్ మండలం జగమర్ల అటవీ ప్రాంతంలో ఆమె మృతదేహం లభ్యమైంది.

చిత్తూరులో అదృశ్యమైన మహిళ దారుణ హత్య
Chittoor News

చిత్తూరు, ఏప్రిల్ 1: పెద్దపంజాని మండల కేంద్రానికి చెందిన చంద్రమ్మ(35) అనే మహిళ దారుణ హత్యకు గురైంది. చంద్రమ్మ రెండు రోజుల నుంచి కనిపించడం లేదని కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసి మహిళ కోసం గాలించగా.. పలమనేరు రూరల్ మండలం జగమర్ల అటవీ ప్రాంతంలో చంద్రమ్మ మృతదేహం లభ్యమైంది. నగదు లావాదేవీలు కారణంగా ఈ హత్య జరిగినట్లు బంధువులు అనుమానిస్తున్నారు. ఈ కేసులో అనుమానితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.


భార్యాభర్తల మధ్య గొడవల కారణంగా గత కొన్నేళ్లుగా భర్తకు దూరంగా ఉంటోంది చంద్రమ్మ. పెద్దపంజానిలో టైలరింగ్ పని చేస్తూ చిట్టిల వ్యాపార లావాదేవీలు కొనసాగించేది. చంద్రమ్మ కనబడడం లేదని ఆమె బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేయగా.. విచారణలో ఆమె హత్య విషయం వెలుగులోకి వచ్చింది. చంద్రమ్మ హత్య స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించింది.


ఇవి కూడా చదవండి...

ఈ నెలలో భగభగలే!

చట్టబద్ధం.. కట్టుదిట్టం!

Read Latest AP News And Telugu News

Updated Date - Apr 01 , 2026 | 10:08 AM