YS Jagan: దండుపాళ్యం బ్యాచ్‌తో జగన్ దండయాత్ర..!

ABN, Publish Date - Jul 09 , 2025 | 08:55 AM

పరామర్శల పేరుతో వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మరోసారి దండయాత్రకు సిద్ధమయ్యారు. చిత్తూరు జిల్లా బంగారు పాళ్యంలో మామిడి రైతులని బుధవారం పరామర్శించనున్నారు.

పరామర్శల పేరుతో వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మరోసారి దండయాత్రకు సిద్ధమయ్యారు. చిత్తూరు జిల్లా బంగారు పాళ్యంలో మామిడి రైతులని ఇవాళ(బుధవారం) పరామర్శించనున్నారు. జగన్ పర్యటన నేపథ్యంలో ఇప్పటికే కొత్త ముఖాలు, బయట వ్యక్తులతో బంగారు పాల్యం పూర్తిగా నిండిపోయింది.


బుధవారం ఉదయం 11 గంటలకు బంగారు పాల్యానికి జగన్ చేరుకోనున్నారు. షరతులతో కూడిన అనుమతులని మాత్రమే పోలీసు యంత్రాంగం ఇచ్చారు. మార్కెట్ యార్డులో 500 మందికి, హెలిప్యాడ్ వద్ద 30 మందికి మాత్రమే అనుమతి ఇచ్చినట్లు జిల్లా ఎస్పీ మణికంఠ చందోలు స్పష్టం చేశారు. ఎలాంటి ర్యాలీలు, బహిరంగ సభలకు అనుమతి ఇవ్వలేదని ఎస్పీ మణికంఠ చెబుతున్నారు. అయితే వైసీపీ శ్రేణులు మాత్రం భారీ జన సమీకరణ చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి:

జగన్‌ జీవితమంతా ఇక ఓదార్పు యాత్రలే

స్లీపర్‌ సెల్స్‌పై సింగిల్‌ జడ్జి ఉత్తర్వులు నిలిపివేత

For More AP News and Telugu News

Updated at - Jul 09 , 2025 | 09:22 AM