Share News

Minister Seethakka: గుడ్ న్యూస్.. మంత్రి సీతక్క కృషి.. తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం

ABN , Publish Date - Aug 22 , 2025 | 08:38 PM

అర్హులైన ప్రతి ఒక్కరికి నూతన రేషన్ కార్డులు మంజూరు చేస్తున్నామని మంత్రి సీతక్క తెలిపారు. దేశంలో ఎక్కడా లేని విధంగా సన్నబియ్యం పథకాన్ని ఇందిరమ్మ ప్రభుత్వం ప్రవేశపెట్టిందని మంత్రి సీతక్క ఉద్ఘాటించారు.

Minister Seethakka: గుడ్ న్యూస్.. మంత్రి సీతక్క కృషి.. తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం
Minister Seethakka

వరంగల్, ఆగస్టు22, (ఆంధ్రజ్యోతి): ఉమ్మడి వరంగల్ జిల్లా అభివృద్ధి పనుల కోసం తెలంగాణ ప్రభుత్వం (Telangana Government) భారీగా నిధులు విడుదల చేసింది. పంచాయతీ రాజ్ శాఖ నుంచి ఉమ్మడి వరంగల్ జిల్లాకు నిధులు విడుదల అయ్యాయి. మంత్రి సీతక్క (Minister Seethakka) చొరవతో పంచాయతీరాజ్ శాఖకు రూ.1200 కోట్లు నిధులు విడుదలయ్యాయి. ఉమ్మడి వరంగల్ జిల్లాలో పంచాయతీరాజ్ శాఖ ఇంటిగ్రేటెడ్ భవనాలు, అదేవిధంగా ఎంపీపీ భవనాలకు నిధులు మంజూరయ్యాయి.


మరోవైపు.. మహబూబాబాద్ జిల్లాలోని గంగారం, కొత్తగూడ మండలాల్లో మంత్రి సీతక్క పర్యటించారు. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మీడియాతో మాట్లాడారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ నూతన రేషన్ కార్డులు మంజూరు చేస్తున్నామని తెలిపారు. దేశంలో ఎక్కడా లేని విధంగా సన్నబియ్యం పథకాన్ని ఇందిరమ్మ ప్రభుత్వం ప్రవేశపెట్టిందని ఉద్ఘాటించారు మంత్రి సీతక్క.


పేద, బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి ఇందిరమ్మ ప్రభుత్వం కృషి చేస్తోందని వెల్లడించారు. 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇస్తున్నామని స్పష్టం చేశారు. గృహజ్యోతి పథకం కింద రూ.500లకే సబ్బిడీ గ్యాస్ పంపిణీ చేస్తున్నామని వివరించారు. ప్రజలు స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్‌ను ఆదరించాలని మంత్రి సీతక్క కోరారు.


ఈ వార్తలు కూడా చదవండి

లైసెన్సు తీసుకున్న కేబుల్ తప్ప ఏవీ ఉంచొద్దు... హైకోర్టు కీలక ఆదేశాలు

గుడ్ న్యూస్.. ఆ శాఖలో పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

Read Latest Telangana News and National News

Updated Date - Aug 22 , 2025 | 08:43 PM