Telangana Health Department Notification: గుడ్ న్యూస్.. ఆ శాఖలో పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల
ABN , Publish Date - Aug 22 , 2025 | 03:56 PM
తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయడానికి తెలంగాణ ప్రభుత్వం సిద్ధమైంది. 1623 స్పెషలిస్ట్ డాక్టర్ పోస్టుల భర్తీకి రేవంత్ ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది.
హైదరాబాద్, ఆగస్టు22(ఆంధ్రజ్యోతి): తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖలో (Telangana Health Department) ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయడానికి తెలంగాణ ప్రభుత్వం (Telangana Government) సిద్ధమైంది. 1623 స్పెషలిస్ట్ డాక్టర్ పోస్టుల భర్తీకి రేవంత్ ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. తెలంగాణ వైద్య విధాన పరిషత్ పరిధిలోని హాస్పిటల్‌లో 1616, ఆర్టీసీ హాస్పిటల్‌లో 7 పోస్టులు భర్తీ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఆయా దరఖాస్తులకు సెప్టెంబర్ 8వ తేదీ నుంచి 22వ తేదీ వరకూ గడువు విధించింది తెలంగాణ ప్రభుత్వం.
ఈ పోస్టుల భర్తీతో తెలంగాణ వైద్య విధాన పరిషత్‌లోని హాస్పిటళ్లలో స్పెషలిస్ట్ డాక్టర్ల సంఖ్య పెరుగనున్నాయి. జిల్లా, ఏరియా హాస్పిటళ్లు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లలో వైద్య సేవలు మరింత మెరుగవనున్నాయి. పల్లెలకు స్పెషాలిటీ వైద్య సేవలు చేరువ అవనున్నాయి. ఆరోగ్యశాఖలో ఇప్పటికే సుమారు 8 వేల పోస్టులను ప్రభుత్వం భర్తీ చేసింది. మరో 7 వేల పోస్టులకు భర్తీ ప్రక్రియ కొనసాగుతోంది.
ఈ వార్తలు కూడా చదవండి
లైసెన్సు తీసుకున్న కేబుల్ తప్ప ఏవీ ఉంచొద్దు... హైకోర్టు కీలక ఆదేశాలు
Read Latest Telangana News and National News