Minister Vivek: వారు నన్ను టార్గెట్ చేశారు.. మంత్రి వివేక్ వెంకటస్వామి షాకింగ్ కామెంట్స్
ABN , Publish Date - Oct 12 , 2025 | 04:17 PM
జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో కాంగ్రెస్ గెలిస్తే తనకు మంచిపేరు వస్తుందని తనపై కొంతమంది విమర్శలు చేసున్నారని మంత్రి వివేక్ వెంకటస్వామి పేర్కొన్నారు. లక్ష్మణ్ తనపై ఎందుకు విమర్శలు చేస్తున్నారో అర్థం కావడం లేదని మంత్రి వివేక్ వెంకటస్వామి తెలిపారు.
నిజామాబాద్, అక్టోబరు 12 (ఆంధ్రజ్యోతి): సోషల్ మీడియా (Social Media)లో తనను కొంతమంది టార్గెట్ చేశారని మంత్రి వివేక్ వెంకటస్వామి (Minister Vivek Venkataswamy) ఆవేదన వ్యక్తం చేశారు. మంత్రిగా తాను ఎంతో కష్టపడి పనిచేస్తునప్పటికీ కులం ఆధారంగా కుట్రలు, విమర్శలు చేస్తున్నారని వాపోయారు. ఇవాళ (ఆదివారం) నిజామాబాద్‌లో మాలల ఐక్య సదస్సు జరిగింది. ఈ సదస్సులో మంత్రి వివేక్ వెంకటస్వామి పాల్గొని ప్రసంగించారు. మంత్రి అడ్లూరి లక్ష్మణ్ (Minister Adluri Laxman)ని కొంతమంది రెచ్చగొట్టి తనపై విమర్శలు చేయించారని ఆందోళన వ్యక్తం చేశారు మంత్రి వివేక్ వెంకటస్వామి.
జూబ్లీహిల్స్ ఉపఎన్నిక (Jubilee Hills Bye Election)లో కాంగ్రెస్ గెలిస్తే తనకు మంచిపేరు వస్తుందని కొంతమంది విమర్శలు చేసున్నారని చెప్పుకొచ్చారు. లక్ష్మణ్ తనపై ఎందుకు విమర్శలు చేస్తున్నారో అర్థం కావడం లేదని తెలిపారు. హైదరాబాద్ నగరంలో జరిగిన ఓ సమావేశానికి లక్ష్మణ్ వచ్చినప్పుడు తాను వెళ్లిపోతున్నానని అనటం అబద్ధమని పేర్కొన్నారు. తాను మాల జాతి అని లక్ష్మణ్ విమర్శలు చేస్తున్నారని చెప్పుకొచ్చారు. తనకు మంత్రి పదవిపై మోజు లేదని స్పష్టం చేశారు. లక్ష్మణ్‌ని రాజకీయంగా ప్రోత్సహించింది తన తండ్రి కాకా వెంకటస్వామినే అనే విషయం మర్చిపోతున్నారని తెలిపారు. తనమీద ఎందుకు ఇంత ఈర్ష్య అని.. తాను అందరితో కలిసికట్టుగా ఉంటానని మంత్రి వివేక్ వెంకటస్వామి స్పష్టం చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి..
కాంగ్రెస్‌కి ఓటేస్తే బుల్డోజర్లు వస్తాయి.. కేటీఆర్ షాకింగ్ కామెంట్స్
ఎస్సారెస్పీ స్టేజ్ -2పై సీఎం రేవంత్‌రెడ్డి కీలక నిర్ణయం
Read Latest Telangana News and National News