Harish Rao On Telangana Workers: జోర్డాన్‌లో చిక్కుకున్న తెలంగాణ కార్మికులు.. హరీశ్‌రావు చర్యలు
ABN , Publish Date - Oct 12 , 2025 | 07:25 PM
ఉపాధి కోసం తెలంగాణ రాష్ట్రం నుంచి వెళ్లి జోర్డాన్‌లో చిక్కుకున్న గల్ఫ్ కార్మికులతో ఫోన్‌లో మాట్లాడారు మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు. ఈ సందర్భంగా ఆందోళన పడవద్దని.. బీఆర్ఎస్ అండగా ఉంటుందని ధైర్యం చెప్పారు.
సిద్దిపేట, అక్టోబరు 12(ఆంధ్రజ్యోతి): ఉపాధి కోసం తెలంగాణ (Telangana) రాష్ట్రం నుంచి వెళ్లి జోర్డాన్‌లో చిక్కుకున్న గల్ఫ్ కార్మికుల (Gulf Workers)తో ఫోన్‌లో మాట్లాడారు మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు (Harish Rao). ఆందోళన పడకండి.. బీఆర్ఎస్ అండగా ఉంటుందని కార్మికులకు ఆయన ధైర్యం చెప్పారు. జోర్డాన్‌లో చిక్కుకున్న గల్ఫ్ కార్మికులతో హరీశ్‌రావు మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. కార్మికుల సమస్యలను విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి దృష్టికి తీసుకెళ్లామని తెలిపారు. వారిని తెలంగాణకు రప్పించేందుకు అన్ని విధాలా కృషి చేస్తున్నామని చెప్పుకొచ్చారు. కార్మికుల ఇబ్బందులు తమ దృష్టికి వచ్చిన వెంటనే రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ కుమార్ దృష్టికి తీసుకెళ్లామని వివరించారు హరీశ్‌రావు.
అధైర్య పడొద్దు..
మరోవైపు.. బీఆర్ఎస్ పార్లమెంటరీ నాయకులు, రాజ్యసభ ఎంపీ సురేష్ రెడ్డి.. విదేశీ వ్యవహారాల శాఖ అధికారులతో మాట్లాడుతున్నారని తెలిపారు. ఎలాగైనా కార్మికులని తెలంగాణకు తీసుకువచ్చేందుకు కృషి చేస్తున్నామని, అధైర్య పడొద్దని ధైర్యం చెప్పారు. ఏడాది క్రితం ఉపాధి కోసం వెళ్లి జోర్డాన్‌లో 12 మంది తెలంగాణ వలస కార్మికులు చిక్కుకున్నారని పేర్కొన్నారు హరీశ్‌రావు.
చేతిలో డబ్బులు లేవు: కార్మికుల ఆవేదన..
ఈ సందర్భంగా హరీశ్‌రావుతో కార్మికులు ఫోన్‌లో మాట్లాడారు. దేశం కాని దేశంలో బిక్కుబిక్కుమంటూ నిర్మల్, కామారెడ్డి, నిజామాబాద్, జగిత్యాల, సిద్దిపేటకు చెందిన గల్ఫ్ కార్మికులం బతుకుతున్నామని వివరించారు. అక్కడే ఉండి బతికేందుకు చేతిలో డబ్బులు లేక, కంపెనీ అనుమతి ఇవ్వకపోవడంతో తిరిగి స్వదేశానికి రాలేక అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని హరీశ్‌రావుకి గోడు వెళ్లబోసుకున్నారు కార్మికులు. ఎలాగైనా తమను తెలంగాణలో ఉన్న కుటుంబసభ్యుల వద్దకు చేర్చాలని కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు.
సైనికుల సేవ గొప్పది: హరీశ్‌రావు
మరోవైపు.. సిద్దిపేట విపంచి ఆడిటోరియంలో జరుగుతున్న సిద్దిపేట జిల్లా ఎక్స్ సర్వీస్ మెన్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రథమ వార్షికోత్సవ కార్యక్రమం ఇవాళ(ఆదివారం) జరిగింది. ఈ కార్యక్రమానికి హరీశ్‌రావు హాజరై మాట్లాడారు. ‘దేశం కోసం మీరు చేసే సేవ గొప్పది. మిలిటరీలో ఉండే క్రమశిక్షణ అందరికీ ఆదర్శం. ఇతర ప్రాంతాల్లో మీరు ఉద్యోగం చేస్తే.. మీ పిల్లలు ఇక్కడ నాన్ లోకల్ అవుతున్నారు. రేవంత్‌రెడ్డి ప్రభుత్వం ఈ విషయంపై దృష్టి పెట్టాలి. సైనికులు దేశం కోసం పని చేస్తారు.. అందుకే మీరంటే అందరికీ ఆదర్శం. తప్పకుండా మా ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది. ఎక్స్ సర్వీస్ మెన్ వెల్ఫేర్ అసోసియేషన్ సమస్యలకి పరిష్కారం చూపిస్తాం’ అని హరీశ్‌రావు పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
కాంగ్రెస్‌కి ఓటేస్తే బుల్డోజర్లు వస్తాయి.. కేటీఆర్ షాకింగ్ కామెంట్స్
ఎస్సారెస్పీ స్టేజ్ -2పై సీఎం రేవంత్‌రెడ్డి కీలక నిర్ణయం
Read Latest Telangana News and National News