Share News

Kishan Reddy Comments on MODI Govt: కేంద్ర ప్రభుత్వానికి వచ్చే మూడేళ్లు కీలకం: కిషన్‌రెడ్డి

ABN , Publish Date - Oct 03 , 2025 | 06:01 PM

కాలం చెల్లిన చట్టాలను ప్రధానమంత్రి నరేంద్రమోదీ రద్దు చేశారని బీజేపీ ఎంపీ కె.లక్ష్మణ్ తెలిపారు. దేశాన్ని ఆర్థికంగా విచ్ఛిన్నం చేసేందుకు ఇతర దేశాలు కుట్రలు పన్నుతున్నాయని విమర్శించారు.

Kishan Reddy Comments on MODI Govt: కేంద్ర ప్రభుత్వానికి వచ్చే మూడేళ్లు కీలకం: కిషన్‌రెడ్డి
Kishan Reddy Comments on MODI Govt

హైదరాబాద్, అక్టోబరు 3 (ఆంధ్రజ్యోతి): కేంద్ర ప్రభుత్వానికి (Central Government) వచ్చే మూడేళ్లు చాలా కీలకమని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి (Kishan Reddy) వ్యాఖ్యానించారు. ప్రతి శాఖ అనేక రిఫార్మ్స్ తీసుకువస్తోందని చెప్పుకొచ్చారు. కొత్త సమస్యలు వచ్చే అవకాశం ఉందని... వాటిని సమర్థవంతంగా ఎదుర్కొవాలని సూచించారు. బ్రిటిష్ చట్టాలు ఇప్పటికీ అమలు అవుతున్నాయని తెలిపారు. వర్తమాన ప్రజల ఆలోచనలకు అనుగుణంగా చట్టాలు తేవాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీ (PM Narendra Modi) ఆలోచిస్తున్నారని చెప్పుకొచ్చారు. ఇవాళ (శుక్రవారం) హైదరాబాద్‌లోని బీజేపీ స్టేట్ ఆఫీస్‌లో ఆ పార్టీ స్టేట్ లీగల్ సెల్ సమావేశం (BJP State Legal Cell Meeting) జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా కేంద్ర న్యాయ శాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హాజరయ్యారు. ఈ సమావేశంలో బీజేపీ తెలంగాణ చీఫ్ రాంచందర్ రావు, ఎంపీలు కె.లక్ష్మణ్, రఘునందన్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కిషన్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు.


అర్జున్ రామ్ మేఘవాల్ ఐఏఎస్‌గా ఉన్నప్పటికీ రాజీనామా చేసి కేంద్ర మంత్రి స్థాయికి ఎదిగారని ప్రశంసించారు. బీజేపీ శ్రేణులు కేంద్ర ప్రభుత్వ ఇమేజ్ పెంచే ప్రయత్నం చేయాలని దిశానిర్దేశం చేశారు. కేంద్రం పాలసీలకు అనుగుణంగా కోర్టుల్లో మనం వాదిస్తామనేది చాలా కీలకమని తెలిపారు. రానున్న మూడేళ్లు మోదీ ప్రభుత్వానికి చాలా కీలకమని ఉద్ఘాటించారు. అందుకు ప్రత్యేకమైన శిక్షణ తరగతులు నిర్వహించాలని మార్గనిర్దేశం చేశారు. కేంద్ర ప్రభుత్వ స్టాండ్ బలంగా వినిపించేందుకు ఎఫర్ట్ పెట్టాలని సూచించారు. తెలంగాణలో అధికారంలోకి బీజేపీ రావాలంటే అందరం కలసికట్టుగా పని చేయాలని దిశానిర్దేశం చేశారు కిషన్‌రెడ్డి.


కాలం చెల్లిన చట్టాలను ప్రధాని మోదీ రద్దు చేశారు: ఎంపీ లక్ష్మణ్

కాలం చెల్లిన చట్టాలను ప్రధానమంత్రి నరేంద్రమోదీ రద్దు చేశారని బీజేపీ ఎంపీ కె.లక్ష్మణ్ తెలిపారు. దేశాన్ని ఆర్థికంగా విచ్ఛిన్నం చేసేందుకు ఇతర దేశాలు కుట్రలు పన్నుతున్నాయని విమర్శించారు. ప్రధాని మోదీ విజనరీ లీడర్ కాబట్టి వేగంగా స్పందిస్తున్నారని చెప్పుకొచ్చారు. జీఎస్టీ తగ్గింపుతో దీపావళి వెలుగులను పేదల ఇళ్లల్లో మోదీ నింపుతున్నారని వివరించారు. అగ్రదేశాలు అడ్డగోలు టారిఫ్‌లతో భారతదేశాన్ని ఉక్కిరిబిక్కిరి చేయాలని చూస్తున్నాయని ధ్వజమెత్తారు. ఇండియా ఎదుగుదలను చాలా దేశాలు జీర్ణించుకోలేక పోతున్నాయని ఫైర్ అయ్యారు. స్వదేశీ వస్తువుల వినియోగించడం ద్వారా.. భారతదేశ ఆదాయం ఇతర దేశాలకు వెళ్లకుండా ఉంటుందని వెల్లడించారు. దీని ద్వారా పెట్టుబడులు పెరుగుతాయని... ఇతరులకు ఉపాధి కలుగుతోందని ఎంపీ లక్ష్మణ్ పేర్కొన్నారు.


న్యాయవాదులకు భద్రత కల్పించే చట్టాలు రావాలి: రాంచందర్ రావు

ప్రజలకు త్వరితగతిన న్యాయం దక్కాలని గత చట్టాలను రద్దు చేసి.. భారత న్యాయ సంహిత చట్టాలను మోదీ సర్కార్ తెచ్చిందని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు రాంచందర్ రావు తెలిపారు. హైదరాబాద్ నడి రోడ్డుపై గతంలో ఓ న్యాయవాది దంపతులను నరికి చంపారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కేసు వేసిన వాళ్లను వెనక్కి తీసుకోకపోతే హత్య చేశారని చెప్పుకొచ్చారు. ఈ కేసులో సీబీఐ దర్యాప్తు ప్రస్తుతం జరుగుతోందని వివరించారు. న్యాయవాదులకు భద్రత కల్పించే చట్టాలు దేశంలో రావాలని రాంచందర్ రావు ఆకాంక్షించారు.


ఇవి కూడా చదవండి...

డ్రగ్స్‌పై తెలంగాణ పోలీసుల ఉక్కుపాదం.. ఏం చేశారంటే..

హైదరాబాద్‌లో పర్యటించనున్న కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్..

Read Latest TG News And Telugu News

Updated Date - Oct 03 , 2025 | 08:12 PM