JITO Connect Event: హైదరాబాద్‌లో పర్యటించనున్న కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్..
ABN , Publish Date - Oct 03 , 2025 | 11:40 AM
ఈ రోజు (శుక్రవారం) హైటెక్స్‌లో జరగనున్న జీటో కనెక్ట్ కార్యక్రమంలో పాల్గొననున్నారు. ఈ ఉదయం 11.30 గంటలకు ఆయన హైదరాబాద్‌లోని బేగంపేట ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు.
కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్ హైదరాబాద్‌లో పర్యటించనున్నారు. ఈ రోజు (శుక్రవారం) హైటెక్స్‌లో జరగనున్న జీటో కనెక్ట్ కార్యక్రమంలో పాల్గొననున్నారు. ఈ ఉదయం 11.30 గంటలకు ఆయన హైదరాబాద్‌లోని బేగంపేట ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు. 12 గంటలకు జీటో కనెక్ట్ ప్రారంభ కార్యక్రమంలో పాల్గొంటారు. 2.45 గంటలకు బేగంపేట ఎయిర్‌పోర్టునుంచి ఆయన తిరుగు ప్రయాణం అవుతారు.
పాకిస్తాన్‌కు హెచ్చరిక..
కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్ పాకిస్తాన్‌కు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. గురువారం గుజరాత్‌లోని భుజ్‌లో జరిగిన దసరా కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. ‘సర్ క్రీక్ సెక్టార్‌లో పాకిస్తాన్ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు పాల్పడినా తీవ్ర పరిణామాలు ఉంటాయి. చరిత్రతో పాటు భౌగోళిక పరిస్థితులు కూడా మారిపోతాయి. చర్చలతో పరిస్థితులు చక్కదిద్దడానికి చాలా ప్రయత్నించాం. పాకిస్తాన్ ఉద్ధేశ్యాలు ఏంటో అర్థం కావటం లేదు. సర్ క్రీక్‌లో మిలటరీని దించింది. దీంతో పాక్ ఉద్ధేశ్యం ఏంటో అర్థం అయిపోయింది’ అని అన్నారు.