Share News

Telangana Police Deports Nigerian: డ్రగ్స్‌పై తెలంగాణ పోలీసుల ఉక్కుపాదం.. ఏం చేశారంటే..

ABN , Publish Date - Oct 03 , 2025 | 04:56 PM

డ్రగ్స్‌పై తెలంగాణ పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. ప్రధానంగా హైదరాబాద్‌లో డ్రగ్స్‌ గ్యాంగుల ఆటకట్టిస్తున్నారు పోలీసులు. నైజీరియా నుంచి డ్రగ్స్ తీసుకువచ్చి హైదరాబాద్‌లో సప్లై చేస్తున్న ఓ వ్యక్తిని పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు.

Telangana Police Deports Nigerian: డ్రగ్స్‌పై తెలంగాణ పోలీసుల ఉక్కుపాదం.. ఏం చేశారంటే..
Telangana Police Deports Nigerian

హైదరాబాద్, అక్టోబరు 3 (ఆంధ్రజ్యోతి): డ్రగ్స్‌పై తెలంగాణ పోలీసులు (Telangana Police) ఉక్కుపాదం మోపుతున్నారు. ప్రధానంగా హైదరాబాద్‌లో డ్రగ్స్‌ గ్యాంగుల (Drugs Gangs) ఆటకట్టిస్తున్నారు పోలీసులు. నైజీరియా (Nigeria) నుంచి డ్రగ్స్ తీసుకువచ్చి హైదరాబాద్‌లో సప్లై చేస్తున్న ఓ వ్యక్తిని పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు.


పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కొన్నిరోజుల క్రితం గ్రీండర్ అనే గే డేటింగ్ యాప్ ద్వారా నైజీరియాకు చెందిన వ్యక్తి జియోఫ్రీ.. హైదరాబాద్‌లో డ్రగ్స్ సప్లై చేశాడు. అయితే, ఆ వ్యక్తి కదలికలపై పోలీసులు నిఘా పెట్టారు. భాగ్యనగరానికి డ్రగ్స్ ఎక్కడి నుంచి తీసుకువస్తున్నాడు.. ఎవరెవరికి ఇస్తున్నాడనే సమాచారాన్ని తెలుసుకున్నారు. ఇందుకోసం ప్రత్యేక పోలీసు టీమ్ ను ఏర్పాటు చేశారు ఉన్నతాధికారులు. అనంతరం నిందితుడిని పట్టుకుని ఆట కట్టించారు హైదరాబాద్‌ పోలీసులు.


అయితే, సదరు వ్యక్తి 2019లో ఫేక్ పాస్‌పోర్ట్‌తో ఐవరీ కోస్ట్ నుంచి నేపాల్‌లోకి ప్రవేశించాడు. అక్కడి నుంచి ఇండియాకు వచ్చాడు. ఢిల్లీ నుంచి డ్రగ్స్ తీసుకొచ్చి హైదరాబాద్, బెంగుళూరులో సప్లై చేస్తున్నాడు సదరు నైజీరియన్. ఈ క్రమంలో ఆ వ్యక్తిని పట్టుకున్న పోలీసులు హైదరాబాద్ నుంచి తన సొంత దేశమైనా నైజీరియాకు పంపించారు. డ్రగ్స్ అమ్మినా, సేవించినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. డ్రగ్స్ జోలికెళ్లి విలువైన జీవితాన్ని నాశనం చేసుకోవద్దని హైదరాబాద్ పోలీసులు హెచ్చరిస్తున్నారు.


ఇవి కూడా చదవండి...

పెదనాన్న అవమానం.. బాలిక ఆత్మహత్య

హైదరాబాద్‌లో పర్యటించనున్న కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్..

Read Latest TG News And Telugu News

Updated Date - Oct 03 , 2025 | 06:25 PM