Share News

Hyderabad Suicide Case: పెదనాన్న అవమానం.. బాలిక ఆత్మహత్య

ABN , Publish Date - Oct 03 , 2025 | 12:25 PM

ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థిని పింకీ(17) ఆత్మహత్యకు పాల్పడింది. పింకీ సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.

Hyderabad Suicide Case: పెదనాన్న అవమానం.. బాలిక ఆత్మహత్య
Girl Suicide

హైదరాబాద్: మనుషులు మానవత్వాన్ని మరిచిపోయి.. డబ్బు కోసం తన, మన అని తేడా లేకుండా దారుణాలకు పాల్పడుతున్నారు. విచక్షణ రహితంగా ప్రవర్తిస్తూ.. చావులకు కారణం అవుతున్నారు. ఇలాంటి ఘటనే ఒకటి కుత్బుల్లాపూర్, పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. సొంత పెద్దనాన్న దాష్టికానికి ఓ బాలిక బలైపోయింది. తన పెదనాన్న అవమానించారని ఆత్మహత్యకు పాల్పడింది.


పోలీసులు తెలిపిన కథనం ప్రకారం.. ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థిని పింకీ(17) ఆత్మహత్యకు పాల్పడింది. పింకీ సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. తన తండ్రి చనిపోయిన తర్వాత అతనికి రావలసిన డబ్బు కోసం సొంత పెదనాన్న అందరి ముందు అవమాన పరచాడని లేటర్‌లో చెప్పుకొచ్చింది. మానసిక వేధింపులు భరించలేక ఆత్మహత్య చేసుకుంటున్నట్లు పేర్కొంది. ఈ మేరకు కేసు నమోదు చేసి.. దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.


ఇవి కూడా చదవండి..

TamilNadu Bomb Threat: సీఎం స్టాలిన్, నటి త్రిష నివాసాలకు బాంబు బెదిరింపులు..

Notorious Cattle Thief : చోరీ చేసిన పశువులను వధిస్తున్న యూనిట్‌పై పోలీసు దాడులు

Updated Date - Oct 03 , 2025 | 01:17 PM