Share News

Notorious Cattle Thief : చోరీ చేసిన పశువులను వధిస్తున్న యూనిట్‌పై పోలీసు దాడులు

ABN , Publish Date - Oct 03 , 2025 | 09:20 AM

చోరీ చేసిన పశువుల్ని తన నివాసంలో వధిస్తూ వాటి మాంసాన్ని ప్రాసెస్ చేస్తోన్న ఒక అక్రమ యూనిట్ పై పోలీసులు దాడులు చేశారు. దక్షిణ కర్ణాటకలోని బంట్వాల్ గ్రామంలో హసనబ్బా అనే వ్యక్తి..

Notorious Cattle Thief :  చోరీ చేసిన పశువులను వధిస్తున్న యూనిట్‌పై పోలీసు దాడులు
Notorious Cattle Thief

బంట్వాల్ (దక్షిణ కర్ణాటక), అక్టోబర్ 3 : చోరీ చేసిన పశువుల్ని తన నివాసంలో వధిస్తూ వాటి మాంసాన్ని ప్రాసెస్ చేస్తోన్న ఒక అక్రమ యూనిట్ పై కర్ణాటక పోలీసులు దాడులు చేశారు. దక్షిణ కన్నడలోని బంట్వాల్ గ్రామంలో హసనబ్బా అనే వ్యక్తి ఇప్పటికే పలుమార్లు ఇలాంటి అకృత్యపు పనులకు పాల్పడినట్టు పోలీసులు తెలిపారు. హసనబ్బా ఇల్లు, అక్రమ వధ యూనిట్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.


2020 కర్ణాటక పశువుల వధ నిషేధం, పశువుల సంరక్షణ చట్టం సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. దక్షిణ కన్నడ జిల్లాలో ఇలాంటి యూనిట్ ను పోలీసులు స్వాధీనం చేసుకోవడం ఇదే మొదటి సారి. హసనబ్బా నిరంతర క్రిమినల్ చర్యలను అరికట్టేందుకు బంట్వాల్ రూరల్ పోలీసులు మంగళూరు సబ్-డివిజనల్ మ్యాజిస్ట్రేట్‌కు నివేదిక సమర్పించి చర్యలు తీసుకున్నారు. ఈ చర్య దక్షిణ కన్నడలో అక్రమ పశు వధలను అరికట్టడానికి కీలక మలుపుగా నిలుస్తుందని పోలీసు అధికారులు తెలిపారు.


కాగా, హసనబ్బా మరిపల్ల పాడి, పుడు గ్రామ పంచాయతీ పరిధిలో నివసిస్తున్నాడు. అతనిపై భారతీయ న్యాయ సంహిత (BNS) సెక్షన్ 303, పశు సంరక్షణ చట్టం, పశువుల వధ నిషేధ చట్టం కింద కేసులు నమోదు చేసి అరెస్ట్ చేశారు. 2017, 2018లో కూడా పశువుల చోరీ, వధ సంబంధిత కేసులు అతనిపై ఉన్నాయి.


ఇవి కూడా చదవండి..

Drinking Tea Empty Stomach: పరగడుపున టీ తాగుతున్నారా.. అయితే జాగ్రత్త..

Special Trains: ప్రయాణికులకు రైల్వేశాఖ గుడ్‌న్యూస్.. పండుగ‌ల సంద‌ర్భంగా ప్రత్యేక రైళ్లు..

Updated Date - Oct 03 , 2025 | 09:29 AM