TamilNadu Bomb Threat: సీఎం స్టాలిన్, నటి త్రిష నివాసాలకు బాంబు బెదిరింపులు..
ABN , Publish Date - Oct 03 , 2025 | 10:55 AM
స్టార్ హీరోయిన్ త్రిషా చెన్నై నగరంలోని సెనోటాఫ్ రోడ్ వద్ద నివసిస్తున్నారు. ఇది సీఎం స్టాలిన్ నివసించే రోడ్డుకు సమీపంలో ఉండటంతో.. ఆ ప్రాంతాల్లో భద్రత కట్టుదిట్టం చేశారు.
తమిళనాడు రాష్ట్రంలో మరోసారి బాంబు బెదిరింపులు కలకలం రేపాయి. గుర్తు తెలియని వ్యక్తులు, ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్, సినీ నటి త్రిష నివాసం, రాజ్‌భవన్, బీజేపీ కార్యాలయాలకు బాంబు బెదిరింపు కాల్స్ చేశారు. దీంతో వెంటనే భద్రతా బలగాలు అప్రమత్తం అయ్యాయి. ఈ మేరకు అధికారులు బాంబు డిటెక్షన్ స్క్వాడ్‌ను, డాగ్ స్క్వాడ్‌ను రంగంలోకి దించి క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించారు. తనిఖీలో ఎలాంటి పేలుడు పదార్థాలు, అనుమానాస్పద వస్తువులు దొరకలేదని అధికారులు స్పష్టం చేశారు.
అయితే.. స్టార్ హీరోయిన్ త్రిషా చెన్నై నగరంలోని సెనోటాఫ్ రోడ్ వద్ద నివసిస్తున్నారు. ఇది సీఎం స్టాలిన్ నివసించే రోడ్డుకు సమీపంలో ఉండటంతో.. ఆ ప్రాంతాల్లో భద్రత కట్టుదిట్టం చేశారు. ఈ మేరకు బెదిరింపు కాల్స్ చేసిన వారిని పట్టుకునేందుకు అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు. కాల్స్ చేసిన వ్యక్తుల కాల్ లొకేషన్ ట్రాక్ చేసే పనిలో పడ్డారు అధికారులు. అసలు బెదిరింపులకు ఎందుకు పాల్పడుతున్నారు..? ఎవరు పాల్పడుతున్నారు..? ఈ బెదిరింపుల వెనక రాజకీయ లేదా వ్యక్తిగత కుట్రలు ఉన్నాయా.. ? అనే కోణాల్లో అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. తాజా బెదిరింపుల నేపథ్యంలో చెన్నైలో భద్రతను కట్టుదిట్టం చేశారు.
ఇవి కూడా చదవండి..
Ind-China Flight Service: కుదిరిన అంగీకారం.. భారత్, చైనా మధ్య ఈ నెలాఖరు నుంచీ..
President Murmu At Red Fort Dasara: ఉగ్రవాదంపై విజయానికి ప్రతీక ఆపరేషన్ సిందూర్