Share News

Good News For Teachers: పండగ వేళ.. టీచర్లకు గుడ్ న్యూస్..

ABN , Publish Date - Aug 26 , 2025 | 09:11 PM

ప్రస్తుతం విద్యాశాఖ సీఎం రేవంత్ రెడ్డి దగ్గరే ఉన్న సంగతి తెలిసిందే. విద్యావ్యవస్థను బలోపేతం చేయడమే తన లక్ష్యమని రేవంత్ రెడ్డి ఇప్పటికే పలుమార్లు చెప్పారు. ఇతరులకు ఇస్తే శాఖను పట్టించుకుంటారో లేదో అనే సందేహాంతో తన వద్దే ఉంచుకున్నట్లు చెప్పారు.

Good News For Teachers: పండగ వేళ.. టీచర్లకు గుడ్ న్యూస్..

హైదరాబాద్: వినాయక చవితి సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం ఉపాధ్యాయులకు గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్రంలో టీచర్ల ప్రమోషన్ ప్రక్రియ పూర్తయినట్లు పేర్కొంది. మొత్తం 4,454 మంది ఉపాధ్యాయులకు పదోన్నతులు కల్పించబోతున్నట్లు తెలిపింది. 880 మంది స్కూల్ అసిస్టెంట్స్‌కు, 811 మంది SGTలకు హెడ్ మాస్టర్లుగా ప్రమోషన్ కల్పించనుంది. 2,763 మంది SGTలకు స్కూల్ అసిస్టెంట్‌లుగా పదోన్నతి కల్పించనున్నట్లు ప్రకటించింది.


అయితే.. ప్రస్తుతం విద్యాశాఖ సీఎం రేవంత్ రెడ్డి దగ్గరే ఉన్న సంగతి తెలిసిందే. విద్యావ్యవస్థను బలోపేతం చేయడమే తన లక్ష్యమని రేవంత్ రెడ్డి ఇప్పటికే పలుమార్లు చెప్పారు. ఇతరులకు ఇస్తే శాఖను పట్టించుకుంటారో లేదో అనే సందేహాంతో తన వద్దే ఉంచుకున్నట్లు చెప్పారు. అటు పలు పాఠశాలల్లో రెగ్యులర్ హెచ్ఎం లేకపోవడంతో పలు సమస్యలు నెలకొంటున్నాయి. ఈ క్రమంలో ప్రభుత్వ నిర్ణయంపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

లిక్కర్ స్కామ్‌లో నిందితులకు మళ్లీ రిమాండ్ పొడిగింపు

ఈ రాశుల వారు.. ఈ మంత్రాలు చదివితే దశ..

For More Telangana News and Telugu News..

Updated Date - Aug 26 , 2025 | 09:11 PM