Share News

Vinayaka Chavithi: ఆ రాశుల వారు.. ఈ మంత్రాలు చదివితే దశ తిరిగినట్టే..

ABN , Publish Date - Aug 26 , 2025 | 04:45 PM

వినాయక చవితి రోజు.. ఈ రాశుల వారు.. ఈ మంత్రాలు పఠిస్తే.. సంపదతోపాటు భోగ భాగ్యాలు కలుగుతాయని పండితులు చెబుతున్నారు.

Vinayaka Chavithi: ఆ రాశుల వారు.. ఈ మంత్రాలు చదివితే దశ తిరిగినట్టే..
Vinayaka Chavithi.. zodiac signs

ఈ ఏడాది వినాయక చవితి.. భద్ర పద మాసం శుక్ల పక్ష చతుర్థ తిథి ఆగస్టు 27వ తేదీ.. అంటే బుధవారం వచ్చింది. ఈ రోజు దేశవ్యాప్తంగా వినాయక చవితి ఉత్సవాలు ఘనంగా జరుపుకోంటారు. అలాగే ఊరు వాడ, ప్రతీ ఇంటా వినాయకుడు భక్తుల నుంచి పూజలందుకుంటారు. ఈ పూజలో భాగంగా వినాయకుడిని ప్రసన్నం చేసుకునేందుకు భక్తులు వివిధ మంత్రాలు పఠిస్తారు. అయితే ఈ పండగ వేళ.. ఏ రాశి వారు ఏ మంత్రాలు పఠిస్తే.. విఘ్నాలు తొలగి పోతాయనే విషయాన్ని పండితులు వివరిస్తున్నారు.


మేష రాశి:

ఓం శ్రీవిఘ్నేశ్వరాయ నమ:

ఓం గజాననాయ నమ:

ఈ మంత్రాలను 108 సార్లు జపించాలి. అలా చేయడం వల్ల మీకు శుభ ఫలితాలు అందుకుంటారు.


వృషభ రాశి:

ఓం శివ పుత్రాయ నమ:

ఓం గజ వక్ర నమ:

ఓం ద్విముఖాయ నమ:

ఈ మంత్రాలు పఠించడం వల్ల మానసిక ఒత్తిడి నుంచి ఉపశమనం పొందుతారు.


మిథున రాశి:

ఓం సుముఖాయ నమ:

ఓం లంబోదరాయ నమ:

ఈ మంత్రాలను 108 సార్లు జపించాలి. (వ్యాపారంలో విజయం సాధిస్తారు)


కర్కాటక రాశి:

ఓం గౌరీపుత్రాయ నమ:

ఓం బ్రహ్మరూపిణే నమ:

ఈ మంత్రాలు జపించడం వల్ల మీరు అన్ని రంగాల్లో విజయం సాధిస్తారు.


సింహరాశి:

ఓం సుఖనిధయే నమ:

ఓం భక్త వాసాయే నమ:

ఈ మంత్రాలు జపించడం వల్ల కెరీర్ పరంగా మంచి పురోగతి సాధిస్తారు.


కన్యరాశి:

ఓం విఘ్నేశాయ నమ:

ఓం మహాకాలాయ నమ:

ఈ మంత్రాలు జపించడం వల్ల జీవితంలో ఎదురయ్యే సమస్యలను అధిగమిస్తారు.


తులా రాశి:

ఓం మహాబలాయ నమ:

ఓం సర్వ కళ్యాణ హేతువే నమ:

ఈ మంత్రాలు 108 సార్లు జపించడం వల్ల మీ భౌతిక ఆనందం పెరుగుతుంది.


వృశ్చిక రాశి:

ఓం మహోదరాయ నమ:

ఓం ఏకదంతాయ నమ:

ఈ మంత్రాలు 108 సార్లు జపించడం వల్ల మీ జీవితంలో ఎదురయ్యే అడ్డంకులనీ తొలగిపోతాయి.


ధనస్సు రాశి:

ఓం ఉమాసుతాయ నమ:

ఓం మహావీరాయ నమ:

ఈ మంత్రాలు జపించడం వల్ల ఆర్థిక సమస్యల నుంచి ఉపశమనం పొందుతారు.


మకర రాశి:

ఓం అగ్రపూజ్యాయ నమ:

ఓం విఘ్నహరాయ నమ:

ఈ మంత్రాలు పఠించడం వల్ల మీ కోరికలు నెరవేరతాయి.


కుంభరాశి:

ఓం సర్వాయ నమ:

ఓం విశ్వరాజ నమ:

ఈ రోజు ఈ మంత్రాలు పఠించడం వల్ల శని దేవుని ప్రభావం నుంచి ఉపశమనం పొందవచ్చు.


మీన రాశి:

ఓం ప్రముఖాయ నమ:

ఓం పార్వతీ పుత్రాయ నమ:

ఈ మంత్రం వల్ల వినాయకుడి అనుగ్రహం త్వరితగతిన కలుగుతోంది.

ఈ వార్తలు కూడా చదవండి..

వినాయకుడి విగ్రహాన్ని ఇక్కడ మాత్రం ఉంచవద్దు.. ఎందుకంటే..

ఉపవాస సమయంలో ఏం తినాలి.. ఏం తినకూడదో తెలుసా?

మరిన్నీ ఆధ్యాత్మిక వార్తలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Aug 26 , 2025 | 07:50 PM