Kukatpally Renu Agarwal Case: కూకట్‌పల్లి రేణు మర్డర్ కేసును మలుపు తిప్పిన క్యాబ్ డ్రైవర్.
ABN , Publish Date - Sep 13 , 2025 | 09:45 AM
కూకట్‌పల్లిలో రేణు అగర్వాల్ హత్య కేసును హైదరాబాద్ పోలీసులు ఛేదించారు. రేణు అగర్వాల్ హత్య కేసులో ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు పోలీసులు.
హైదరాబాద్, సెప్టెంబరు13 (ఆంధ్రజ్యోతి): కూకట్‌పల్లిలో రేణు అగర్వాల్ హత్య కేసును (Renu Agarwal Case) హైదరాబాద్ పోలీసులు ఛేదించారు. రేణు అగర్వాల్ హత్య కేసులో ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు పోలీసులు. ఢిల్లీలో నిఖిల్‌ను పట్టుకున్నారు పోలీసులు.
రాంచీలో మరో ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు. రేణు అగర్వాల్ హత్యకు ముందు తూప్రాన్‌లో మందు పార్టీ చేసుకున్నారు హర్ష గ్యాంగ్. పార్టీలో మొత్తం తొమ్మిది మందిని గుర్తించారు హైదరాబాద్ పోలీసులు. క్యాబ్ డ్రైవర్ ఇచ్చిన సమాచారంతో నిందితులను అరెస్ట్ చేశారు. ఈ కేసుకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
కాగా, కూకట్‌పల్లిలోని స్వాన్‌లేక్ గేటెడ్ కమ్యూనిటీ అపార్టుమెంట్‌లో రాకేష్, రేణు అగర్వాల్ దంపతులు నివసిస్తున్నారు. జార్ఖండ్‌కు చెందిన హర్ష వారి ఇంట్లో పనిచేస్తున్నారు. హర్ష తన గ్యాంగుతో రేణు అగర్వాల్‌ను బుధవారం మధ్యాహ్నం హత్య చేశారు. మొదట రాకేష్ ఇంట్లోకి వెళ్లిన ఇద్దరూ.. ఒంటరిగా ఉన్న రేణు అగర్వాల్ నోట్లో దుస్తులు కుక్కి కాళ్లు చేతులు కట్టేశారు. లాకర్ తాళాలు ఎక్కడున్నాయో చెప్పాలని, ఎక్కడెక్కడ డబ్బు, బంగారం ఉందో చెప్పాలని చిత్రహింసలు పెట్టారు. సుమారు గంటకుపైగా ఆమెను చిత్రహంసలు పెట్టినా నోరు విప్పకపోవడంతో ఆగ్రహానికి గురైన దుండగులు కుక్కర్‌తో రేణు అగర్వాల్ తలపై బలంగా కొట్టారు. ఆపై ఆమెను కత్తితో గొంతుకోసి విచక్షణా రహితంగా పొడిచి చంపేశారు. అనంతరం ఇంట్లోనే స్నానం చేసి, ట్రావెల్ బ్యాగుతో పారిపోయారు. ఈ కేసును పోలీసులు సీరియస్‌గా విచారిస్తున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
బంగారం ధరకు రెక్కలు.. ఈ రోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..
రూ.12 వేల కోట్లు కాదు.. రూ.12 కోట్లే!
Read Latest Telangana News and National News