Share News

Telangana Government: ఆ కాలేజీల్లో ఫీజుల పెంపుదలపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం

ABN , Publish Date - Aug 21 , 2025 | 07:23 PM

ఇంజనీరింగ్, వృత్తి విద్యా కాలేజీల్లో ఫీజుల నిర్దారణకు ప్రస్తుతం ఉన్న నిబంధనల్లో సవరణలను చేస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కళాశాలల్లో బోధనా ప్రమాణాలు, నిబంధనలు పాటిస్తున్నాయా లేదా అన్న అంశాలను పరిగణలోకి తీసుకుని మాత్రమే ఫీజులు పెంచేందుకు అనుమతి ఇచ్చింది.

Telangana Government: ఆ కాలేజీల్లో ఫీజుల పెంపుదలపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
Telangana Government

హైదరాబాద్, ఆగస్టు21, (ఆంధ్రజ్యోతి): ఇంజనీరింగ్, వృత్తి విద్యా కాలేజీల్లో ఫీజుల నిర్దారణకు ప్రస్తుతం ఉన్న నిబంధనల్లో సవరణలను చేస్తూ తెలంగాణ ప్రభుత్వం (Telangana Government) ఉత్తర్వులు జారీ చేసింది. కళాశాలల్లో బోధనా ప్రమాణాలు, నిబంధనలు పాటిస్తున్నాయా లేదా అన్న అంశాలను పరిగణలోకి తీసుకుని మాత్రమే ఫీజులు పెంచేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.


కాలేజీలు నాణ్యమైన విద్యా అందిస్తున్నాయా లేదా.. ఆ కాలేజీ విద్యార్థులకు ప్లేస్‌మెంట్స్ ఎలా ఉన్నాయి. విద్యార్థుల హజరు శాతం ఎలా ఉంది. ఫేషియల్ రికగ్నిషన్ అమలు చేస్తున్నారా లేదా. ఆధార్ ఆధారిత పే మెంట్స్ చేస్తాన్నారా లేదా. పరిశోధనలకు ప్రోత్సాహం ఉందా లేదా. ఆ కాలేజీకి జాతీయ, అంతర్జాతీయ ర్యాంకింగ్‌లు వచ్చాయా లేదా. తెలంగాణ ప్రభుత్వ నిబంధనలు పాటిస్తున్నాయా లేదా అనే అంశాలను పరిగణనలోకి తీసుకొని ఫీజులను తెలంగాణ ప్రభుత్వం నిర్దారించనుంది.


ఈ వార్తలు కూడా చదవండి

శ్రీశైలంలో కుట్రలు.. ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు

కాళేశ్వరం నివేదిక.. హై కోర్టులో వాడివేడిగా వాదనలు

Read Latest Telangana News And Telugu News

Updated Date - Aug 21 , 2025 | 07:29 PM