Share News

Telangana Congress on Local Elections: స్థానిక ఎన్నికలపై టీ కాంగ్రెస్ ఫోకస్

ABN , Publish Date - Oct 04 , 2025 | 10:23 AM

స్థానిక సంస్థల ఎన్నికలపై ఫోకస్ చేసింది తెలంగాణ కాంగ్రెస్. ఈనెల 9వ తేదీన స్థానిక ఎన్నికలకు నోటిఫికేషన్ రానున్న నేపథ్యంలో అభ్యర్థుల ఎంపికపై హస్తం పార్టీ దృష్టి పెట్టింది.

Telangana Congress on Local Elections: స్థానిక ఎన్నికలపై టీ కాంగ్రెస్ ఫోకస్
Telangana Congress on Local Body Elections

హైదరాబాద్, అక్టోబరు4 (ఆంధ్రజ్యోతి): స్థానిక సంస్థల ఎన్నికల (Local Body Elections)పై ఫోకస్ చేసింది తెలంగాణ కాంగ్రెస్ (Telangana Congress). ఈనెల 9వ తేదీన స్థానిక ఎన్నికలకు నోటిఫికేషన్ రానున్న నేపథ్యంలో అభ్యర్థుల ఎంపికపై దృష్టి పెట్టింది హస్తం పార్టీ. రేపు(ఆదివారం) సాయంత్రంలోగా ప్రతీ స్థానానికి ముగ్గురు అభ్యర్థుల చొప్పున సిఫారసు చేయాలని ఆదేశించారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy). సీఎం ఆదేశాలతో వరుస సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు జిల్లా ఇన్‌చార్జ్ మంత్రులు.


జెట్పీటీసీ అభ్యర్థుల ఎంపిక బాధ్యతని టీపీసీసీ కమిటీకి అప్పగించారు కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జీ మీనాక్షి నటరాజన్. సర్పంచ్, ఎంపీటీసీ అభ్యర్థుల ఎంపికని డీసీసీలకు అప్పగించారు టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్. పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో అభ్యర్థుల ఎంపిక బాధ్యతను సెక్రటరీలకు అప్పగించారు సీఎం రేవంత్‌రెడ్డి. ఈ నేపథ్యంలో ఈనెల 8వ తేదీన అన్ని స్థానాలకు అభ్యర్థుల ప్రకటన చేయనున్నారు టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్.


ఈ వార్తలు కూడా చదవండి...

హైడ్రా దూకుడు.. భాగ్యనగరంలో మరోసారి కూల్చివేతలు

అధికారిక లాంఛనాలతో రాంరెడ్డి దామోదర్‌రెడ్డి అంత్యక్రియలు

Read Latest TG News And Telugu News

Updated Date - Oct 04 , 2025 | 10:33 AM