Share News

Ramreddy Damodar Reddy: అధికారిక లాంఛనాలతో రాంరెడ్డి దామోదర్‌రెడ్డి అంత్యక్రియలు

ABN , Publish Date - Oct 04 , 2025 | 09:37 AM

కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్‌రెడ్డి అంత్యక్రియలు శనివారం మధ్యాహ్నం తుంగతుర్తిలోని తన వ్యవసాయ క్షేత్రంలో జరుగనున్నాయి. అధికారిక లాంఛనాలతో దామోదర్ రెడ్డి అంత్యక్రియలు నిర్వహించనుంది తెలంగాణ ప్రభుత్వం.

Ramreddy Damodar Reddy: అధికారిక లాంఛనాలతో రాంరెడ్డి దామోదర్‌రెడ్డి అంత్యక్రియలు
Ramreddy Damodar Reddy

సూర్యాపేట, అక్టోబరు4 (ఆంధ్రజ్యోతి): కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్‌రెడ్డి(73) (Ramreddy Damodar Reddy) అంత్యక్రియలు ఇవాళ(శనివారం) మధ్యాహ్నం తుంగతుర్తిలోని తన వ్యవసాయ క్షేత్రంలో జరుగనున్నాయి. అధికారిక లాంఛనాలతో దామోదర్ రెడ్డి అంత్యక్రియలు నిర్వహించనుంది తెలంగాణ ప్రభుత్వం. నిన్న(శుక్రవారం) రాత్రి సూర్యాపేట నుంచి తుంగతుర్తికి చేరుకుంది దామోదర్ రెడ్డి భౌతికకాయం. ఈరోజు ఉదయం 11 గంటలకు అంత్యక్రియలు ప్రారంభం కానున్నాయి. దామోదర్ రెడ్డి అంత్యక్రియలకు మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ఇతర ప్రముఖులు హాజరు కానున్నారు. దామోదర్ రెడ్డిని కడసారి చూసేందుకు ఆయన అభిమానులు భారీగా తుంగతుర్తిలోని వ్యవసాయ క్షేత్రానికి తరలి వస్తున్నారు.


కాగా, రాంరెడ్డి దామోదర్‌రెడ్డి(73) అక్టోబర్1వ తేదీ (బుధవారం) రాత్రి 10 గంటలకు తుదిశ్వాస విడిచారు. కొన్నేళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్నఆయన.. రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. ఆరోగ్యం మరింత ఇబ్బందికరంగా మారడంతో కుటుంబ సభ్యులు దామోదర్‌రెడ్డిని గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రిలో చేర్పించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆయన కన్నుమూశారు. కాగా, దామోదర్‌రెడ్డి 1952 సెప్టెంబరు 14వ తేదీన జన్మించారు. వరంగల్‌లోని కాకతీయ యూనివర్సిటీలో బీఎస్సీ విద్యను దామోదర్‌రెడ్డి పూర్తి చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి...

హైడ్రా దూకుడు.. భాగ్యనగరంలో మరోసారి కూల్చివేతలు

ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు..

Read Latest TG News And Telugu News

Updated Date - Oct 04 , 2025 | 09:49 AM