Share News

CM Revanth Reddy: మెస్సితో మ్యాచ్ జీవితకాల జ్ఞాపకం: సీఎం రేవంత్‌రెడ్డి

ABN , Publish Date - Dec 14 , 2025 | 11:47 AM

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌‌రెడ్డి, అర్జెంటీనా ఫుట్‌బాల్‌ దిగ్గజం లియోనెల్‌ మెస్సిల మధ్య ఉప్పల్‌ స్టేడియంలో శనివారం ఫ్రెండ్లీ మ్యాచ్‌ జరిగిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ట్విట్టర్ వేదికగా మెస్సికి ధన్యవాదాలు తెలిపారు సీఎం రేవంత్‌‌రెడ్డి.

CM Revanth Reddy: మెస్సితో మ్యాచ్ జీవితకాల జ్ఞాపకం: సీఎం రేవంత్‌రెడ్డి
CM Revanth Reddy

హైదరాబాద్ , డిసెంబరు14 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌‌రెడ్డి (Telangana CM Revanth Reddy), అర్జెంటీనా ఫుట్‌బాల్‌ దిగ్గజం లియోనెల్‌ మెస్సిల మధ్య ఉప్పల్‌ స్టేడియంలో నిన్న(శనివారం) ఫ్రెండ్లీ మ్యాచ్‌ జరిగిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌‌తో క్రీడాభిమానులంతా ఖుషీ అయిపోయారు. ఈ క్రమంలో ట్విట్టర్ వేదికగా మెస్సికి ధన్యవాదాలు తెలిపారు సీఎం రేవంత్‌‌రెడ్డి.


ప్రపంచానికి చాటి చెప్పాం..

‘మా ఆహ్వానాన్ని మన్నించి, మా హైదరాబాద్ నగరాన్ని ముఖ్యంగా యువతను ఉత్సాహపరిచినందుకు G.O.A.T లియోనెల్ మెస్సి, ఫుట్‌బాల్ దిగ్గజాలు లూయిస్ సువారెజ్, రోడ్రిగో డి పాల్‌‌లకు హృదయపూర్వక ధన్యవాదాలు. మాతో చేరి నిన్న (శనివారం) సాయంత్రం జీవితకాల జ్ఞాపకంగా మార్చినందుకు మా నాయకుడు రాహుల్ గాంధీకి మేము హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. తెలంగాణ అంటే క్రీడలు, శ్రేష్ఠత, ఆతిథ్యం అని ప్రపంచానికి చాటి చెప్పాం. నగరం అంతటా విధుల్లో ఉన్న అన్ని శాఖల అధికారులు, భద్రతా సిబ్బంది, నిర్వాహకులు, సిబ్బందికి కృతజ్ఞతలు, అభినందనలు తెలియజేస్తున్నాం. మా ప్రభుత్వం తరపున, మా అతిథులకు, క్రీడా ప్రేమికులు, అభిమానులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం’ అని సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు.


ఢిల్లీలో సీఎం రేవంత్‌రెడ్డి పర్యటన..

మరోవైపు, సీఎం రేవంత్‌రెడ్డి ఢిల్లీలో పర్యటిస్తున్నారు. ఢిల్లీలో సీఎం పర్యటన బిజీ బిజీగా ఉంది. ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీతో కలిసి నిన్న(శనివారం) శంషాబాద్ ఎయిర్ పోర్టు నుంచి ఢిల్లీకి వెళ్లారు. ఓటు చోరీకి వ్యతిరేకంగా ఇవాళ(ఆదివారం) ఢిల్లీలో జరిగే మహార్యాలీ కార్యక్రమంలో పాల్గొననున్నారు సీఎం  రేవంత్‌రెడ్డి.


ఈ వార్తలు కూడా చదవండి..

పుస్తక మహోత్సవ ప్రాంగణానికి అందెశ్రీ పేరు

తెలంగాణలో భారీ అగ్ని ప్రమాదం.. ఏమైందంటే..

Read Latest Telangana News and National News

Updated Date - Dec 14 , 2025 | 12:06 PM