Share News

CM Revanth Reddy: కేసీఆర్ నాకు అపాయింట్‌మెంట్ ఇస్తారో లేదో.. సీఎం రేవంత్‌రెడ్డి హాట్ కామెంట్స్

ABN , Publish Date - Aug 19 , 2025 | 07:30 PM

బీసీ రిజర్వేషన్ బిల్లుపై సుప్రీంకోర్టు తీర్పుకోసం ఎదురు చూస్తున్నామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. బిల్లులు రాష్ట్రపతి దగ్గర పెండింగ్‌లో ఉన్నాయని గుర్తుచేశారు.

CM Revanth Reddy: కేసీఆర్ నాకు అపాయింట్‌మెంట్ ఇస్తారో లేదో.. సీఎం రేవంత్‌రెడ్డి హాట్ కామెంట్స్
CM Revanth Reddy

హైదరాబాద్, ఆగస్టు19 (ఆంధ్రజ్యోతి): బీసీ రిజర్వేషన్ బిల్లుపై (BC Reservation Bill) సుప్రీంకోర్టు తీర్పుకోసం ఎదురు చూస్తున్నామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (Telangana CM Revanth Reddy) పేర్కొన్నారు. బిల్లులు రాష్ట్రపతి దగ్గర పెండింగ్‌లో ఉన్నాయని గుర్తుచేశారు. ఇవాళ(మంగళవారం) గాంధీభవన్‌లో మీడియాతో సీఎం రేవంత్‌రెడ్డి చిట్‌చాట్ చేశారు. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం 90రోజుల్లో రాష్ట్రపతి బీసీ రిజర్వేషన్ బిల్లు పూర్తిచేయాలని చెప్పుకొచ్చారు. బీసీ రిజర్వేషన్ బిల్లు ఇంకా ఆలస్యమైతే పార్టీ పరంగా ఇద్దామని అందరినీ కోరి ఎన్నికలకు వెళ్లడమే తమ ముందున్న ప్రత్యామ్నాయమని వెల్లడించారు సీఎం రేవంత్‌రెడ్డి.


ఈ నెల 23వ తేదీన జరిగే పీఏసీలో దీనిపై నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్నారు. ఉపరాష్ట్రపతికి మద్దతు కోసం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ను కలుస్తారా అని మీడియా ప్రతినిధులు రేవంత్‌రెడ్డిని ప్రశ్నించారు. అధిష్టానం ఏం ఆదేశిస్తే అదే చేస్తానని తెలిపారు. కేసీఆర్ అపాయింట్‌మెంట్ ఇస్తారో లేదో.. ఆయనకు తన మొఖం చూడటం ఇష్టం ఉందో లేదోనని సరదాగా వ్యాఖ్యానించారు సీఎం రేవంత్‌రెడ్డి.


కేసీఆర్ ఆస్పత్రిలో ఉంటే తానే వెళ్లి పరామర్శించానని గుర్తుచేశారు. జస్టిస్ సుదర్శన్ రెడ్డిని ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా రాజ్యాంగ పరిరక్షణ కోసం ఇండియా కూటమి ఎంపిక చేసిందని చెప్పుకొచ్చారు. తన నిర్ణయం ఏం లేదని.. ఇండియా కూటమి నిర్ణయమని స్పష్టం చేశారు. తాను రెగ్యులర్‌గా ఆయనను కలుస్తానని తెలిపారు. తాను జస్టిస్ సుదర్శన్ రెడ్డి నామినేషన్‌కు వెళ్తానని సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి...

హౌసింగ్ స్కీమ్‌లో అవినీతి.. మంత్రి ఉత్తమ్ చర్యలు

ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్న ఎన్డీఏ.. సీఎం రేవంత్ ఫైర్

For More Telangana News and Telugu News..

Updated Date - Aug 19 , 2025 | 08:13 PM