Revanth Govt On Overseas Education : విద్యార్థులకు శుభవార్త.. రేవంత్ సర్కార్ విప్లవాత్మక నిర్ణయం
ABN , Publish Date - Oct 13 , 2025 | 10:10 PM
ఓవర్సీస్ ఎడ్యుకేషన్ స్కీమ్‌పై రేవంత్‌రెడ్డి సర్కార్ విప్లవాత్మక నిర్ణయం తీసుకుంది. బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్ధులకు రెట్టింపు లబ్ధి చేకూరుస్తూ నిర్ణయం తీసుకుంది. కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయంతో ఓవర్సీస్ విద్యా నిధి కింద లబ్ధిదారుల సంఖ్య పెరిగింది.
హైదరాబాద్, అక్టోబరు 13(ఆంధ్రజ్యోతి): ఓవర్సీస్ ఎడ్యుకేషన్ స్కీమ్‌పై రేవంత్‌రెడ్డి సర్కార్ (Revanth Reddy Government) విప్లవాత్మక నిర్ణయం తీసుకుంది. బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు రెట్టింపు లబ్ధి చేకూరుస్తూ నిర్ణయం తీసుకుంది. కాంగ్రెస్ ప్రభుత్వ నిర్ణయంతో ఓవర్సీస్ విద్యా నిధి కింద లబ్ధిదారుల సంఖ్య పెరిగింది. గతంలో మహాత్మా జ్యోతిబాపూలే ఓవర్సీస్ విద్యా నిధి బీసీ లబ్ధిదారుల సంఖ్య-300 కాగా.. ఇప్పుడు- 700కి పెంచుతూ నిర్ణయం తీసుకుంది రేవంత్‌రెడ్డి సర్కార్.
బీసీ-సీ, బీసీ-ఈలతో కలిపితే 1000 మంది బీసీ విద్యార్థులకు లబ్ధి చేకూరనుంది. అంబేడ్కర్ ఓవర్సీస్ విద్యా నిధి కింద ఎస్సీలకు గతంలో- 210 మందికే అవకాశం కల్పించగా.. ఇప్పుడు - 500 మందికి లబ్ధి చేకూరనుంది. ఎస్టీల్లో లబ్ధిదారులు గతంలో-100 మంది కాగా... ఇప్పడు -200 మందికి చేరింది.
గతంలో మూడు పథకాల ద్వారా లబ్ధి పొందే విద్యార్థుల సంఖ్య -610 మంది కాగా... ఇప్పుడు- 1400 మందికి చేరింది. 130 శాతం పెరిగింది లబ్ధిదారుల సంఖ్య. ఫలితంగా ప్రఖ్యాత అంతర్జాతీయ వర్సిటీల్లో పెరుగనుంది తెలంగాణ విద్యార్థుల సంఖ్య. పదేళ్లుగా ఆశావాహులు పెరుగుతున్నా గత కేసీఆర్ ప్రభుత్వం పట్టించుకోలేదు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఫలితంగా వేలాది మంది విదేశీ వర్సిటీల్లో ఉన్నత విద్యకు దూరమయ్యారు.
ఈ వార్తలు కూడా చదవండి..
పోలీసులు సివిల్ పంచాయితీ చేస్తే చర్యలు తప్పవు: డీజీపీ శివధర్ రెడ్డి
కాంగ్రెస్‌పై ఎన్నికల సంఘానికి కేటీఆర్ ఫిర్యాదు
Read Latest Telangana News And Telugu News