Revanth Government: రేవంత్ సర్కార్ మరో కీలక నిర్ణయం.. ఆ ఇద్దరు ఎమ్మెల్యేలకి కార్పొరేషన్ల పదవులు
ABN , Publish Date - Oct 31 , 2025 | 02:49 PM
రేవంత్‌రెడ్డి సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. మంత్రి పదవి కోసం ఎదురుచూసిన మాజీ మంత్రి, బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్‌రెడ్డి, మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్‌రావులకు కార్పొరేషన్ చైర్మన్ల పదవులని కేటాయించింది తెలంగాణ ప్రభుత్వం.
హైదరాబాద్, అక్టోబరు31(ఆంధ్రజ్యోతి): రేవంత్‌రెడ్డి సర్కార్ (Revanth Reddy Government) మరో కీలక నిర్ణయం తీసుకుంది. మంత్రి పదవి కోసం ఎదురు చూసిన మాజీ మంత్రి, బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్‌రెడ్డి (Sudarshan Reddy), మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్‌రావు (PremsagarRao)లకు కార్పొరేషన్ చైర్మన్ల పదవులని కేటాయించింది. తెలంగాణ ప్రభుత్వ సలహాదారుగా సుదర్శన్‌రెడ్డిని నియమించింది.
కేబినెట్ హోదాతో తెలంగాణ ప్రభుత్వం నియామక ఉత్తర్వులు జారీ చేసింది. 6 గ్యారెంటీల అమలు బాధ్యతని సుదర్శన్‌రెడ్డికి అప్పగించింది కాంగ్రెస్ సర్కార్. అయితే, మంత్రి పదవిని సుదర్శన్‌రెడ్డి ఆశించారు. సివిల్ సప్లాయీస్ కార్పొరేషన్ చైర్మన్‌గా మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్‌రావుని నియమించింది. కేబినెట్ హోదాతో కార్పొరేషన్ చైర్మన్‌గా ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్‌రావు కొనసాగనున్నారు. ఈ నేపథ్యంలో మంత్రి పదవులు ఆశించిన సీనియర్లని కాంగ్రెస్ హైకమాండ్ బుజ్జగిస్తుంది.
కాగా, ఇవాళ(శుక్రవారం) అజారుద్దీన్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే. అయితే, రేవంత్‌రెడ్డి తన మంత్రివర్గాన్ని (Telangana Cabinet) పూర్తిస్థాయిలో విస్తరించడానికి లైన్ క్లియర్ చేశారు. ఈ క్రమంలో నవంబర్‌లో పూర్తి స్థాయి మంత్రివర్గ విస్తరణ చేయనున్నట్లు సమాచారం. అయితే కేబినెట్ విస్తరణలో భాగంగా కొంతమందిని పక్కన పెట్టి కొత్తవారికి మంత్రి పదవులు ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. సామాజిక వర్గాలు, ఉమ్మడి జిల్లాల ప్రాధాన్యత ఆధారంగా కేబినెట్ కూర్పు చేయనున్నట్లు తెలుస్తోంది.
ఇవి కూడా చదవండి...
డీప్‌ఫేక్ పెద్ద గొడ్డలిపెట్టు.. అడ్డుకోవాల్సిందే: చిరంజీవి
ఎమ్మెల్యేల ఫిరాయింపు కేసు.. నేటితో ముగియనున్న గడువు
Read Latest Telangana News And Telugu News