MLA Defection Case: ఎమ్మెల్యేల ఫిరాయింపు కేసు.. నేటితో ముగియనున్న గడువు
ABN , Publish Date - Oct 31 , 2025 | 09:00 AM
బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచిన పదిమంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరిన విషయం తెలిసిందే. ఈ మేరకు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని బీఆర్‌ఎస్ నేతలు స్పీకర్‌కు ఫిర్యాదు చేశారు. స్పీకర్ స్పందించపోవడంతో.. హైకోర్టును ఆశ్రయించారు.
హైదరాబాద్: తెలంగాణలో ఎమ్మెల్యేల ఫిరాయింపు కేసు విషయంలో ఉత్కంఠ కొనసాగుతోంది. మూడు నెలలలోపు స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని జూలై 31న సుప్రీంకోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే. కాగా, ఆ గడువు నేటితో ముగియనుంది. అయితే.. ఇప్పటి వరకు పదిమంది ఎమ్మెల్యేలలో నలుగురు ఎమ్మెల్యేలను మాత్రమే స్పీకర్ విచారించారు. మిగతా 6 మంది విచారణకు ఇంకా షెడ్యూల్ కూడా విడుదల చేయలేదు. నేటితో గడువు ముగియడంతో.. స్పీకర్ మిగతా ఎమ్మెల్యేల విచారణకు కోర్టును మరికొంత సమయం కావాలని కోరే అవకాశం ఉన్నట్లు సమాచారం.
కాగా, బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచిన పదిమంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరిన విషయం తెలిసిందే. ఈ మేరకు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని బీఆర్‌ఎస్ నేతలు స్పీకర్‌కు ఫిర్యాదు చేశారు. స్పీకర్ స్పందించపోవడంతో.. హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు నుంచి బీఆర్ఎస్‌కు సానుకూల తీర్పు రాకపోవడంతో.. సుప్రీంకోర్టు మెట్లెక్కారు. ఈ మేరకు విచారణ చేపట్టిన న్యాయస్థానం మూడు నెలల్లోగా.. స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది.
సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు పార్టీ మారిన పది మంది ఎమ్మెల్యేలకు స్పీకర్ నోటీసులు జారీ చేశారు. అనంతరం ఎమ్మెల్యేలతో విచారణ జరిపారు. ఈ విచారణలో భాగంగా ఎమ్మెల్యేలను, పిటిషనర్లను క్రాస్-ఎగ్జామినేషన్ చేశారు. ఎమ్మెల్యేలు తమ తరపు న్యాయవాదులతో సహా స్పీకర్ ముందు హాజరై, తాము బీఆర్ఎస్‌లోనే ఉన్నామని, ఫిరాయింపు జరగలేదని తమ వాదనలు వినిపించారు. అయితే, పిటిషనర్లైన బీఆర్ఎస్ నేతలు వాటికి సంబంధించిన ఆధారాలు, అఫిడవిట్లు, వీడియోలు సమర్పించారు. ఈ విచారణలో నలుగురు ఎమ్మెల్యేలను మాత్రమే స్పీకర్ విచారించారు. మిగితా 6 మంది ఎమ్మెల్యేల విచారణ ఇంకా పూర్తికాలేదు. మరోవైపు నేటితో సుప్రీం విధించిన గడవు ముగుస్తుంది. ఈ నేపథ్యంలో స్పీకర్ ఏం నిర్ణయం తీసుకుని కోర్టుకు తెలుపుతారు అనే అంశంపై రాష్ట్రవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది.
ఇవి కూడా చదవండి..
Father Heartfelt Plea: ఓ తండ్రి ఆవేదన
Justice Suryakant: 53వ సీజేఐగా జస్టిస్ సూర్యకాంత్