Share News

MP Konda Vishweshwar Reddy: సీఎం రేవంత్ రెడ్డికి ఫుట్‌బాల్ ఎలా ఆడాలో చూపిస్తా..

ABN , Publish Date - Aug 27 , 2025 | 01:51 PM

కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు కుమ్మక్కై దొంగ ఓట్లతో గత ఎన్నికల్లో గెలిచారని కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఆరోపించారు. దొంగ ఓట్లతో బీజేపీ గెలిచినట్టుగా సాక్షాలు ఉంటే దమ్ముంటే బయట పెట్టాలని సవాల్ విసిరారు. కాంగ్రెస్ పార్టీ బీహార్‌లో ఓడిపోతుందన్న భయంతోనే దొంగ ఓట్లు అంటూ.. నాటకాలు ఆడుతున్నారని విమర్శించారు.

MP Konda Vishweshwar Reddy: సీఎం రేవంత్ రెడ్డికి ఫుట్‌బాల్ ఎలా ఆడాలో చూపిస్తా..
Konda-Vishweshwar-Reddy

హైదరాబాద్: చేవెళ్ళ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. ఓటు చోరి చేసి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిందే కాంగ్రెస్ పార్టీ అని ఆరోపించారు. కాంగ్రెస్ చరిత్ర అంతా ఖూనీ చేయడమే అని విమర్శించారు. రాహుల్ గాంధీ ఇప్పుడే నిద్ర నుంచి లేచారా..? అని ఎద్దేవా చేశారు. రాహుల్ గాంధీ ఓట్ చోర్ పాదయాత్ర, దొంగే దొంగ అన్నట్టుగా ఉందని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఓట్ల చోరీలో కాంగ్రెస్ బీఆర్ఎస్ కుమ్మక్కయ్యాయని పేర్కొన్నారు. ఇందిరా గాంధీ చనిపోయిన తర్వాత ఆమె పేరు మీద ఎన్నేళ్లు ఓటు హక్కు ఉందో రాహుల్ గాంధీకి తెలుసా..? అని ప్రశ్నించారు. దాన్ని దొంగ ఓటు అంటారా..? ఇంకే ఓటు అంటారో రాహుల్ గాంధీ చెప్పాలని నిలదీశారు. ఈ మేరకు ఆయన ఇవాళ(బుధవారం) మీడియాతో మాట్లాడారు..


కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు కుమ్మక్కై దొంగ ఓట్లతో గత ఎన్నికల్లో గెలిచారని కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఆరోపించారు. దొంగ ఓట్లతో బీజేపీ గెలిచినట్టుగా సాక్షాలు ఉంటే దమ్ముంటే బయటపెట్టాలని సవాల్ విసిరారు. కాంగ్రెస్ పార్టీ బీహార్‌లో ఓడిపోతుందన్న భయంతోనే దొంగ ఓట్లు అంటూ.. నాటకాలు ఆడుతుందని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ ఇటు ట్రంప్‌తో అటు పాకిస్థాన్, చైనాలతో కుమ్మక్కైందని మండిపడ్డారు. దేవుళ్లను వాడుకునే సంస్కృతి బీజేపీది కాదని, దేవుడిపై, దేశంపై భక్తి మాత్రమే బీజేపీకి ఉంటుందని స్పష్టం చేశారు. నదులను, భూములను గత కాంగ్రెస్ ప్రభుత్వం పాకిస్తాన్‌, చైనాకు అప్పచెప్పిందని విమర్శించారు. రాహుల్ గాంధీ కన్ఫ్యూజన్‌‌లో ఉన్నారని.. ఆయనో పెద్ద కన్ఫ్యూజన్‌‌ మాస్టర్ అని ఎద్దేవా చేశారు.


తాను ఫుట్‌బాల్ ఎవరికి గిఫ్ట్ ఇవ్వలేదని కొండా విశ్వేశ్వర్ రెడ్డి స్పష్టం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి ఒక మంచి ఫుట్‌బాల్ ప్లేయర్ అని చెప్పారు. రేవంత్ రెడ్డికి వచ్చే స్థానిక ఎన్నికల్లో ఫుట్‌బాల్ ఎలా ఆడాలో చూపిస్తానని తెలిపారు. అందుకోసమే పార్టీ ఆఫీస్‌కు ఫుట్‌బాల్ తీసుకొచ్చినట్లు పేర్కొన్నారు. రేవంత్ రెడ్డి తనకు ఎలాంటి ఫుట్‌బాల్ గిఫ్ట్ ఇవ్వలేదని.. ఇస్తే తీసుకుని ఆడుకుంటా అని వ్యాఖ్యానించారు. మెజారిటీతో రాష్ట్రంలో అధికారంలోకి రాబోతున్నామని విశ్వేశ్వర్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి..

అందుకే యూరియా ఆలస్యమైంది

మంత్రి ఉత్తమ్‌‌కు హరీష్ రావు సంచలన లేఖ

Updated Date - Aug 27 , 2025 | 01:53 PM