MLA Krishna Mohan Reddy: స్పీకర్ నోటీసులపై ఎమ్మెల్యే కృష్ణ మోహన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
ABN , Publish Date - Aug 23 , 2025 | 01:04 PM
తనని నమ్ముకున్న ప్రజల అభివృద్ధి ధ్యేయంగా తన అడుగుటు ఉంటాయని ఎమ్మెల్యే కృష్ణ మోహన్ రెడ్డి తెలిపారు. నియోజకవర్గ అభివృద్ధి కోసమే సీఎం రేవంత్ రెడ్డిని కలిశానని వివరించారు. చట్టాలను గౌరవించే వ్యక్తిని.. చట్టానికి లోబడి నిర్ణయం తీసుకుంటానని పేర్కొన్నారు.
జోగులాంబ గద్వాల: ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపు కేసులో స్పీకర్ ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. అయితే నోటీసులపై తాజాగా గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి స్పందించారు. స్పీకర్ తమ కార్యాలయానికి నోటీసులు పంపారని.. వాటిని తమ పీఏలు తీసుకున్నారని తెలిపారు. తాను ఇంకా నోటీసులో ఏం ఉందో చదవలేదని పేర్కొన్నారు. తాను కాంగ్రెస్ పార్టీలో చేరానన్నది అవాస్తవమని కీలక వ్యాఖ్యలు చేశారు. తాను టెక్నికల్‌గా బీఅర్ఎస్‌లోనే ఉన్నానని స్పష్టం చేశారు. నియోజకవర్గం అభివృద్ది లక్ష్యంగానే తన చర్యలు ఉంటాయని చెప్పుకొచ్చారు.
తనని నమ్ముకున్న ప్రజల అభివృద్ధి ధ్యేయంగా తన అడుగుటు ఉంటాయని ఎమ్మెల్యే కృష్ణ మోహన్ రెడ్డి తెలిపారు. నియోజకవర్గ అభివృద్ధి కోసమే సీఎం రేవంత్ రెడ్డిని కలిశానని వివరించారు. చట్టాలను గౌరవించే వ్యక్తిని.. చట్టానికి లోబడి నిర్ణయం తీసుకుంటానని పేర్కొన్నారు. స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకున్న గౌరవిస్తానని ఎమ్మెల్యే అన్నారు. తనకి బీఆర్ఎస్ నేతలతో సహ సంబంధాలు బాగానే ఉన్నాయన్నారు. తనకు మాజీ సీఎం కేసీఆర్ అంటే అపారమైన గౌరవం ఉందని తెలిపారు.
సుప్రీం కోర్టు తీర్పును గౌరవించి బీఆర్‌ఎస్ ఫిర్యాదులపై విచారణ చేపట్టాలని స్పీకర్ నిర్ణయించుకున్నారు. ఇందులో భాగంగానే ఐదుగురు ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేశారు. అయితే మిగిలిన మరో ఐదుగురికి కూడా త్వరలో నోటీసులు జారీ అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఫిరాయింపుల కేసు విచారణకు సంబంధించి నిర్దేశిత సమయాన్ని ఆ నోటీసుల్లో పేర్కొనలేదని సమాచారం. ఈ నేపథ్యంలో సుప్రీం కోర్టు నిర్దేశించిన గడువు లోపల పది మంది ఎమ్మెల్యేలపై విచారణ పూర్తి చేసి స్పీకర్ ప్రసాద్‌కుమార్ నిర్ణయం ప్రకటిస్తారా..? లేక పెండింగ్‌లో పెడతారా..? అన్నది చర్చనీయాంశంగా మారింది. మరోవైపు, ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న పలువురు ఎమ్మెల్యేలు తాము బీఆర్‌ఎస్‌లోనే కొనసాగుతున్నామంటూ పలు సందర్భాల్లో ప్రకటించారు. శాసనసభ రికార్డుల్లోనూ పది మంది ఎమ్మెల్యేలూ బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలుగానే ఉన్నారు. సుప్రీంకోర్టు గడువు ముగిసేలోపు స్పీకర్ ఏ నిర్ణయం తీసుకుంటారన్నది ఆసక్తికరంగా మారింది.
ఇవీ చదవండి..
స్టీల్ ప్లాంటు ప్రైవేటీకరణ నిర్ణయం వెనక్కి తీసుకోవాలి
హైదరాబాద్ కిడ్నీ రాకెట్ కేసులో విశాఖ వైద్యుడు
మరిన్ని ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి..