Ministers and MLAs Meet Governor: గవర్నర్‌ను కలిసిన మంత్రులు, ఎమ్మెల్యేలు..ఎందుకంటే
ABN , Publish Date - Sep 01 , 2025 | 12:44 PM
తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మను మంత్రులు, ఎమ్మెల్యేలు సోమవారం రాజ్ భవన్‌లో కలిశారు. 42 శాతం బీసీ రిజర్వేషన్స్ పెంపు బిల్లు ఆమోదం కోసం వినతి ఇచ్చారు.
హైదరాబాద్, సెప్టెంబర్ 1, (ఆంధ్రజ్యోతి): తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ(Governor Jishnu Dev Verma)ను మంత్రులు, ఎమ్మెల్యేలు ఇవాళ(సోమవారం) రాజ్ భవన్‌లో కలిశారు. 42 శాతం బీసీ రిజర్వేషన్ల పెంపు బిల్లు ఆమోదం కోసం వినతిపత్రం ఇచ్చారు. గవర్నర్ జిష్ణుదేవ్ వర్మను మంత్రులు పొన్నం ప్రభాకర్, సీతక్క, ప్రభుత్వ విప్‌లు ఆది శ్రీనివాస్, బీర్ల ఐలయ్య, మహేష్ కుమార్ గౌడ్, సీపీఐ నారాయణ, ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం కలిశారు. గర్నవర్ జిష్ణుదేవ్ వర్మతో భేటీకి బీజేపీ నేతలు ఎవరూ హాజరుకాలేదు.
బీసీ బిల్లుపై కుట్ర దౌర్భాగ్యం: మంత్రి పొన్నం ప్రభాకర్

అంతకుముందు మంత్రి పొన్నం ప్రభాకర్ మీడియాతో మాట్లాడారు. బీఆర్ఎస్ ఫ్యూడలిస్ట్ పార్టీ అని విమర్శించారు. బీసీల అంశం చర్చకు వస్తే ఇలా అడ్డుపడటం సరికాదని చెప్పుకొచ్చారు. సమాజం గమనిస్తోందని పేర్కొన్నారు. బీఆర్ఎస్‌కి బీసీల పట్ల ఉన్న గౌరవం, వైఖరి స్పష్టం అవుతోందని చెప్పుకొచ్చారు. 42శాతం రిజర్వేషన్లను అడ్డుకోవద్దని సూచించారు మంత్రి పొన్నం ప్రభాకర్.
కులగణన సర్వేలో కూడా బీఆర్ఎస్ నేతలు ఎందుకు పాల్గొనలేదని ప్రశ్నించారు. కడుపులో కత్తులు పెట్టుకొని మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. బీసీలకు 42శాతం రిజర్వేషన్లకు బీఆర్ఎస్ మద్దతు తెలపాలని కోరారు. బీసీ బిల్లు అడ్డుకోవడం ఏం పద్ధతని నిలదీశారు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారని ఫైర్ అయ్యారు. బీఆర్ఎస్ పార్టీకి బీసీ రిజర్వేషన్‌లు ఇష్టం లేకపోవచ్చని చెప్పుకొచ్చారు. బీసీ రిజర్వేషన్లను అడ్డుకునే కుట్ర దౌర్భాగ్యమని మంత్రి పొన్నం ప్రభాకర్ విమర్శించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
హైదరాబాద్ వాసులకు అలర్ట్.. టీజీఎస్పీడీసీఎల్ కొత్త నిబంధనలు
తెలంగాణ శాసనమండలిలో బీసీ బిల్లుకు ఆమోదం
Read latest Telangana News And Telugu News