TGSPDCL New Connection Rules: హైదరాబాద్ వాసులకు అలర్ట్.. టీజీఎస్పీడీసీఎల్ కొత్త నిబంధనలు
ABN , Publish Date - Sep 01 , 2025 | 08:15 AM
కొత్త విద్యుత్ కనెక్షన్ల జారీకి దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (టీజీఎస్పీడీసీఎల్) ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ తప్పనిసరి చేయడంతో గ్రేటర్ జోన్‌లో కొత్త కనెక్షన్ల మంజూరు నిలిచిపోయింది.
హైదరాబాద్ సిటీ, ఆగస్టు 31 (ఆంద్రజ్యోతి): కొత్త విద్యుత్ కనెక్షన్ల (New Electricity Connection) జారీకి దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (టీజీఎస్పీడీసీఎల్) ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ తప్పనిసరి చేయడంతో గ్రేటర్ జోన్‌లో కొత్త కనెక్షన్ల మంజూరు నిలిచిపోయింది. మెట్రో, రంగారెడ్డి, మేడ్చల్ జోన్ల పరిధిలోని 10 సర్కిళ్ల పరిధిలో ప్రతినాలా 15-30 వేల వరకు కొత్త విద్యుత్ కనెక్షన్లకు దరఖాస్తులు వస్తుండగా ప్రధానంగా మేడ్చల్, రంగారెడ్డి బోన్ల పరిధిలో 80శాతం వరకు కనెక్షన్లు జారీ చేస్తుంటారు. రెండు నెలల ప్రీతం వరకు అనుమతి ఉన్న భవనాలకు తాత్కాలిక (కేటగిరి 8)లో కనెక్షన్లు జారీచేసిన దక్షిణ డిస్కం ప్రస్తుతం వాటిని నిలిపి వేసింది. కస్టమర్ సర్వీస్ సెంటర్ల (సీఎస్)లో అను మతి లేని భవనాలకు దరఖాస్తులు కూడా తీసుకోవడం లేదని కొంతమంది అధికారులు చెబుతున్నారు.
పాత కనెక్షన్లతో ఓవర్‌లోడ్
గ్రేటర్‌లో పలు బస్తీలు, కాలనీల్లో, 200-220 గజాల స్థలంలో కొందరు అనుమతులు లేకుండా నిర్మిస్తున్న 4-5 అంతస్తుల భవనాలకు ఓసీ లేదని కొత్త కనెక్షన్లు జారీ చేయడం లేదు. దీంతో కొందరు గతంలో ఉన్న పాత కనెక్షన్ల విద్యుత్‌నే భవనం మొత్తానికి వినియోగించుకుంటున్నారు. గ్రేటర్ వ్యాప్తంగా వందల సంఖ్యలో పాతభవనాల స్థానంలో బహుళ అంతస్తులు వెలుస్తున్నాయి. పాత కనెక్షన్లనే వాటికి వినియోగిస్తుండటంతో ఓవర్‌లోడ్ పడుతోంది. ఫలితంగా షార్ట్ సర్క్యూట్ ప్రమాదాలకు ఇది కూడా కారణమవుతున్నాయని విద్యుత్ రంగ నిపుణులు చెబుతున్నారు..
స్పెషల్ డ్రైవ్‌కు ప్రణాళికలు
శివారు ప్రాంతాల్లో కొందరు రెండు, మూడు అంతస్తులకు అనుమతులు తీసుకుంటూ 4-5 అంతస్తులు నిర్మిస్తుండటంతో అలాంటి భవనాలకు కనెక్షన్లు జారీచేయడం లేదు. గత ఐదేళ్లలో పలు ప్రాంతాల్లో నకిలీ ఓసీలతో విద్యుత్ కనెక్షన్లు జారీ చేశా రనే ఆరోపణలతో డివిజన్ల వారీగా స్పెషల్ డ్రైవ్ చేపట్టేదిశగా ఉన్నతాధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఓసీ సర్టిఫికెట్ లేనికారణంగా శివారు ప్రాంతాల్లోని కొన్ని సెక్షన్లలో వందల సంఖ్యలో ఫైళ్లు పెండింగ్‌లో ఉండగా, మరికొన్ని ఫైళ్లు రిజెక్ట్ అవుతున్నాయి.
ఈ వార్తలు కూడా చదవండి..
నిమ్స్‌లో చిన్నారులకు ఉచిత గుండె ఆపరేషన్లు
Read latest Telangana News And Telugu News