Minister Ponnam Prabhakar: తెలంగాణ హైకోర్టు ఆదేశాలకు అనుగుణంగానే స్థానిక ఎన్నికలు
ABN , Publish Date - Aug 09 , 2025 | 11:57 AM
స్థానిక సంస్థల ఎన్నికలపై మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ హైకోర్టు ఆదేశాలకు అనుగుణంగానే స్థానిక ఎన్నికలు జరుగుతాయని ప్రకటించారు. ముస్లిం రిజర్వేషన్ల అంశాన్ని తమ ప్రభుత్వం ఎక్కడా పేర్కొనలేదని స్పష్టం చేశారు.
హైదరాబాద్, ఆగస్టు9 (ఆంధ్రజ్యోతి): స్థానిక సంస్థల ఎన్నికలపై (Local Body Elections) మంత్రి పొన్నం ప్రభాకర్ (Minister Ponnam Prabhakar) కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ హైకోర్టు ఆదేశాలకు అనుగుణంగానే స్థానిక ఎన్నికలు జరుగుతాయని ప్రకటించారు. ముస్లిం రిజర్వేషన్ల అంశాన్ని తమ ప్రభుత్వం ఎక్కడా పేర్కొనలేదని స్పష్టం చేశారు. రాష్ట్ర అసెంబ్లీలో బీసీ రిజర్వేషన్ల బిల్లు పెట్టినప్పుడు బీజేపీ నేతలు మద్దతు ఇచ్చారని గుర్తుచేశారు. ఇప్పుడు కావాలనే బీజేపీ నేతలు రాద్ధాంతం చేస్తున్నారని మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
సీఎం, మంత్రికి రాఖీ కట్టిన సీతక్క

మరోవైపు.. రాష్ట్ర, దేశ ప్రజలకు రాఖీ పౌర్ణమి సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ శుభాకాంక్షలు తెలిపారు. ఇవాళ(శనివారం) మినిస్టర్ క్వార్టర్స్‌లో మంత్రి పొన్నం ప్రభాకర్, వారి సోదరులకు మంత్రి సీతక్క రాఖీ కట్టారు. ఈ సందర్భంగా సీతక్కకు మంత్రి పొన్నం చీరను బహూకరించారు. సీతక్క నుంచి పొన్నం ప్రభాకర్ ఆశీర్వాదం తీసుకున్నారు. సీతక్కకు పొన్నం ప్రభాకర్ సోదరులు కృతజ్ఞతలు తెలిపారు. అలాగే, రాఖీ పర్వదినం సందర్భంగా జూబ్లీహిల్స్ నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి మంత్రులు సీతక్క, కొండా సురేఖ రాఖీ కట్టారు. మినిస్టర్ క్వార్టర్స్‌లో అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌కి మంత్రి సీతక్క రాఖీ కట్టారు. సోదరి సీతక్క అంటూ ఆత్మీయంగా పలకరించి ప్రసాద్ కృతజ్ఞతలు తెలిపారు బంజారాహిల్స్ మినిస్టర్ క్వార్టర్స్‌లో మంత్రి శ్రీధర్ బాబుకి మంథని నియోజకవర్గ మహిళలు రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి..
సృష్టి కేసులో వైసీపీ నేత సోదరుడు పాత్రపై అనుమానాలు
మహిళల రక్షణ మా బాధ్యత.. సీఎం చంద్రబాబు, రేవంత్‌రెడ్డి రాఖీ శుభాకాంక్షలు
Read latest Telangana News And Telugu News