Minister Konda Surekha: మరోసారి కేటీఆర్‌పై మంత్రి కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు
ABN , Publish Date - Aug 21 , 2025 | 09:49 PM
మాజీ మంత్రి కేటీఆర్ చేసిన కాంగ్రెస్ థార్థ్ క్లాస్ పార్టీ అన్న వ్యాఖ్యలపై మంత్రి కొండా సురేఖ స్పందించారు. పదేళ్లు అధికారంలో ఉండి... ఇప్పుడు అధికారం పోయేసరికి కేటీఆర్ మతి భ్రమించి మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. ముందు కేసీఆర్‌ను అసెంబ్లీకి రప్పించి తర్వాత కేటీఆర్ మాట్లాడితే బాగుంటుందని మంత్రి కొండా సురేఖ హితవు పలికారు.
వరంగల్, ఆగస్టు21(ఆంధ్రజ్యోతి): మాజీ మంత్రి కేటీఆర్ (KTR) చేసిన కాంగ్రెస్ (Congress) థార్థ్ క్లాస్ పార్టీ అన్న వ్యాఖ్యలపై మంత్రి కొండా సురేఖ (Minister Konda Surekha) స్పందించారు. పదేళ్లు అధికారంలో ఉండి... ఇప్పుడు అధికారం పోయేసరికి కేటీఆర్ మతి భ్రమించి మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. ముందు కేసీఆర్‌ను అసెంబ్లీకి రప్పించి తర్వాత కేటీఆర్ మాట్లాడితే బాగుంటుందని హితవు పలికారు. ఇవాళ(గురువారం) వరంగల్ నగర అభివృద్ధిపై పలు శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి కొండా సురేఖ మాట్లాడారు. దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో ఖిలా వరంగల్‌ను అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు మంత్రి కొండా సురేఖ.
ఇందుకోసం తాను తిరుపతి జేఈవో సలహా కూడా తీసుకున్నానని చెప్పుకొచ్చారు. టెక్స్‌టైల్ పార్క్, మామునూరు ఎయిర్ పోర్ట్‌పై సమీక్ష నిర్వహించామని తెలిపారు. ఎయిర్ పోర్ట్‌కు భూములిచ్చిన రైతుల ఖాతాల్లో ఇప్పటికే రూ.34 కోట్లు వేశామని ప్రకటించారు. అండర్ గ్రౌండ్ డ్రైనేజీపై డీపీఆర్ సిద్ధం చేశామని, అనుమతి రాగానే పనులు ప్రారంభిస్తామని వెల్లడించారు. ఎయిర్ పోర్ట్ పూర్తయితే వరంగల్ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందని తెలిపారు. వరంగల్ బస్టాండ్ త్వరలోనే పూర్తి చేస్తామని మాటిచ్చారు. వరంగల్‌లో మొన్నటి వరదల్లో కొన్ని ఇళ్లు దెబ్బతిన్నాయని.. వారిని ఆదుకుంటామని మాటిచ్చారు. దేవాదాయశాఖ భూములను రక్షించడం తమ బాధ్యత అని మంత్రి కొండా సురేఖ పేర్కొన్నారు
ఈ వార్తలు కూడా చదవండి
శ్రీశైలంలో కుట్రలు.. ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు
కాళేశ్వరం నివేదిక.. హై కోర్టులో వాడివేడిగా వాదనలు
Read Latest Telangana News And Telugu News