Ponguleti VS Konda Surekha War: మంత్రులు పొంగులేటి, కొండా సురేఖ మధ్య టెండర్ల వార్
ABN , Publish Date - Oct 11 , 2025 | 10:52 AM
మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి , కొండా సురేఖ మధ్య మేడారం ఆలయ టెండర్ల వార్ నడుస్తోంది. మంత్రి పొంగులేటిపై సీఎం రేవంత్‌రెడ్డికి కొండా సురేఖ ఫిర్యాదు చేశారు.
హైదరాబాద్, అక్టోబరు11(ఆంధ్రజ్యోతి): మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి (Ponguleti Srinivasa Reddy), కొండా సురేఖ (Konda Surekha) మధ్య మేడారం ఆలయ టెండర్ల వార్ నడుస్తోంది. మంత్రి పొంగులేటిపై సీఎం రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy)కి కొండా సురేఖ ఫిర్యాదు చేశారు. మేడారం టెండర్లలో ఇన్‌చార్జ్ మంత్రి పొంగులేటి జోక్యం చేసుకుంటున్నారని ఆరోపించారు. దేవాదాయశాఖకు చెందిన రూ.71కోట్ల టెండర్‌ను తన మనిషికి ఇప్పించుకునేందుకు పొంగులేటి ప్రయత్నాలు చేస్తున్నారని విమర్శించారు కొండా సురేఖ.
ఈ నేపథ్యంలో పొంగులేటి తీరుపై కొండా సురేఖ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. తన శాఖలో మంత్రి పొంగులేటి జోక్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పొంగులేటిపై సీఎం రేవంత్‌రెడ్డి, కాంగ్రెస్ అధిష్టానానికి ఫిర్యాదు చేశారు కొండా సురేఖ. కొండా సురేఖ ఫిర్యాదుపై హైకమాండ్ ఎలాంటి చర్యలు తీసుకోంటుందోనని కాంగ్రెస్ శ్రేణులు చర్చించుకుంటున్నారు.
కాగా, మేడారం ఆలయం అభివృద్ధిపై రేవంత్‌రెడ్డి ప్రభుత్వం స్పెషల్ ఫోకస్ పెట్టింది. ఇందులో భాగంగానే సీఎం రేవంత్‌రెడ్డి ఆలయ పనులని ఎప్పటికప్పుడూ పర్యవేక్షిస్తున్నారు. ఇటీవల సీఎం మేడారంలో పర్యటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో అధికారులు మేడారం ఆలయ పనులని ప్రతిష్టాత్మకంగా చేపట్టాలని ఆదేశించారు ముఖ్యమంత్రి. రాబోయే మేడారం జాతరలోపు ఆలయ అభివృద్ధి పనులని పూర్తిచేయాలని దిశానిర్దేశం చేశారు. ఈ నేపథ్యంలో మేడారం ఆలయ అభివృద్ధి పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ క్రమంలో మంత్రుల మధ్య టెండర్ల వార్ బయటకు రావడం చర్చనీయాంశంగా మారింది.
ఈ వార్తలు కూడా చదవండి..
ఏబీఎన్ - ఆంధ్రజ్యోతి చేతిలో.. హైకోర్టు మధ్యంతర ఉత్తర్వుల కాపీ
తెలంగాణలో కొత్త పోలీసింగ్ విధానం.. డీజీపీ శివధర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
Read Latest Telangana News and National News