Share News

Maoist Party on Abhay Statement: మావోయిస్ట్ పార్టీ సంచలన ప్రకటన.. అసలు విషయమిదే..

ABN , Publish Date - Sep 19 , 2025 | 07:35 PM

మావోయిస్ట్ పార్టీ నేతలు మరోసారి సంచలన ప్రకటన చేశారు. కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి అభయ్ చేసిన సాయుధ పోరాట విరమణ ప్రకటనపై స్పందించారు. అభయ్ ఇచ్చిన స్టేట్‌మెంట్.. ఆయన వ్యక్తిగతమని చెప్పుకొచ్చారు.

Maoist Party on Abhay Statement: మావోయిస్ట్ పార్టీ సంచలన ప్రకటన.. అసలు విషయమిదే..
Maoist Party on Abhay Statement

హైదరాబాద్, సెప్టెంబరు 19 (ఆంధ్రజ్యోతి): మావోయిస్ట్ పార్టీ నేతలు (Maoist Party Leaders) మరోసారి సంచలన ప్రకటన చేశారు. కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి అభయ్ (Abhay) చేసిన సాయుధ పోరాట విరమణ ప్రకటనపై స్పందించారు. అభయ్ ఇచ్చిన స్టేట్‌మెంట్.. ఆయన వ్యక్తిగతమని చెప్పుకొచ్చారు. అభయ్ ఇచ్చిన స్టేట్‌మెంట్‌తో తమకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. శాంతి చర్చలు జరగాలని ఈ ఏడాది మార్చి నుంచి ప్రతివాదనలు చేస్తున్నామని గుర్తుచేశారు మావోయిస్ట్ పార్టీ నేతలు.


ఆపరేషన్ కగార్ (Operation Kagar) నిలిపివేసి శాంతియుత వాతావరణంలో చర్చలు జరగాలని డిమాండ్ చేశారు. కేంద్ర, రాష్ట్ర కమిటీ సభ్యులు అనారోగ్య కారణాలతో లొంగిపోతున్నారని తెలిపారు. శాంతి చర్చలపై అభిప్రాయాలు తెలపాలని మెయిల్ అడ్రస్ ఇవ్వడం అర్ధరహితమని పేర్కొన్నారు. ఇలాంటి ప్రకటనలు చేసే వారు పార్టీ అనుమతి తీసుకునే చేస్తే బాగుండేదని చెప్పుకొచ్చారు మావోయిస్ట్ పార్టీ నేతలు.


ఆయుధాలు వదిలి పెడదామని ఏకపక్షంగా అభయ్ చేసిన ప్రకటన పార్టీకి నష్టం కలిగించే విధంగా ఉందని తెలిపారు. పార్టీలో ఎలాంటి చర్చలు జరుపకుండా.. సాయుధ పోరాట విరమణ ప్రకటన చేయడం తీవ్రమైన చర్య అని మావోయిస్ట్ పార్టీ నేతలు హెచ్చరించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

జూనియర్‌ ఎన్టీఆర్‌కు ప్రమాదం.. ఏమైందంటే..

తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్లుగా మారండి: సీఎం రేవంత్‌రెడ్డి

For More Telangana News And Telugu News

Updated Date - Sep 19 , 2025 | 07:43 PM