Mallu Bhatti Vikramarka Meeting ON Bankers: తలసరి ఆదాయంలో తెలంగాణ నెంబర్ వన్: మల్లు భట్టి విక్రమార్క
ABN , Publish Date - Sep 08 , 2025 | 02:33 PM
తలసరి ఆదాయంలో దేశంలోనే తెలంగాణ నెంబర్ వన్ అని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఉద్ఘాటించారు. వ్యవసాయం, పారిశ్రామిక, సేవా రంగాల్లో స్థిరమైన వృద్ధితో దేశంలోనే తెలంగాణ నెంబర్ వన్‌గా నిలిచిందని నొక్కిచెప్పారు.
హైదరాబాద్, సెప్టెంబరు8 (ఆంధ్రజ్యోతి): తలసరి ఆదాయంలో దేశంలోనే తెలంగాణ నెంబర్ వన్ అని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క (Mallu Bhatti Vikramarka) ఉద్ఘాటించారు. వ్యవసాయం, పారిశ్రామిక, సేవా రంగాల్లో స్థిరమైన వృద్ధితో దేశంలోనే తెలంగాణ నెంబర్ వన్‌గా నిలిచిందని నొక్కిచెప్పారు. కర్ణాటక, హర్యానాలను అధిగమించి తెలంగాణ రాష్ట్రం రికార్డు సాధించిందని పేర్కొన్నారు. ఇవాళ(సోమవారం) హైదరాబాద్‌లో రాష్ట్రస్థాయి బ్యాంకర్ల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మల్లు భట్టి విక్రమార్క పాల్గొని మాట్లాడారు.
వార్షిక రుణ ప్రణాళికలో మొదటి క్వార్టర్‌లోనే 33.64శాతం సాధించడం అభినందనీయమని పేర్కొన్నారు. ఇందిరమ్మ ఇళ్లకు, స్వయం ఉపాధి పథకాలకు, వ్యవసాయ అనుబంధ రంగాలకు విరివిగా రుణాలు ఇవ్వాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ రంగాన్ని ఆర్థిక వ్యవస్థకు వెన్నుముకగా భావిస్తోందని చెప్పుకొచ్చారు మల్లు భట్టి విక్రమార్క.
రైతుల పక్షాన రైతు రుణమాఫీ, రైతు భరోసా పేరిట రూ.30 వేల కోట్లు రైతుల పక్షాన బ్యాంకులకు రాష్ట్ర ప్రభుత్వం జమ చేసిందని.. బ్యాంకింగ్ రికవరీ చరిత్రలో ఇది ఒక రికార్డు అని ఉద్ఘాటించారు. రైతులకు సకాలంలో రుణాలు ఇవ్వాలని సూచించారు. ఆస్తుల తాకట్టు, ఫిక్స్‌డ్ డిపాజిట్లు చేయాలని మార్గ నిర్దేశం చేశారు. బ్యాంకుల అధికారులు రైతులను ఒత్తిడి చేయొద్దని కోరారు. రైతుల విషయంలో బ్యాంకర్లు మానవీయ కోణంలో ఆలోచించాలని మల్లు భట్టి విక్రమార్క సూచించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డికి ఊరట, పరువునష్టం దావా కేసు విచారణకు సుప్రీం నిరాకరణ
ఉప రాష్ట్రపతి ఎన్నికకు బీఆర్ఎస్ దూరం.. మరోసారి BRS-BJP బంధం బయటపడిందన్న కాంగ్రెస్
For More TG News And Telugu News