Kishan Reddy: ప్రధాని మోదీతో భేటీ విషయాలను లీక్ చేసిందెవరు.. కిషన్‌రెడ్డి ఫైర్
ABN , Publish Date - Dec 16 , 2025 | 12:00 PM
ప్రధానమంత్రి నరేంద్రమోదీతో జరిగిన సమావేశంలో సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండాలని మాత్రమే చెప్పారని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణలో బీజేపీని మరింత బలోపేతం చేయాలని మోదీ కోరారని తెలిపారు.
ఢిల్లీ, డిసెంబరు16 (ఆంధ్రజ్యోతి): ప్రధానమంత్రి నరేంద్రమోదీతో (PM Narendra Modi) ఇటీవల తెలంగాణ బీజేపీ నేతలు సమావేశం అయిన విషయం తెలిసిందే. ఈ సమావేశంలో నేతలకు పలు కీలక అంశాలపై ప్రధాని మోదీ దిశానిర్దేశం చేశారు. అయితే ఈ భేటీలో ప్రస్తావించిన విషయాలు బయటకు వచ్చాయి. ఈ విషయంపై ఢిల్లీ వేదికగా కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి (Kishan Reddy) స్పందించారు.
ప్రధానమంత్రి నరేంద్రమోదీతో తెలంగాణ బీజేపీ ఎంపీల సమావేశంపై వచ్చిన లీకులపై కిషన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. మోదీతో చర్చించిన విషయాలు బయటకు ఎలా వచ్చాయని ప్రశ్నించారు. ఎవరో కావాలనే ఈ విషయాలను లీకు చేశారని ఫైర్ అయ్యారు. ఈ సమావేశంలో ప్రస్తావించిన అంశాలను బయటకు చెప్పొద్దని మోదీ చెప్పారని గుర్తుచేశారు కిషన్‌రెడ్డి.
కానీ మీటింగ్‌లో జరిగిన విషయాలను బయటకు ఎవరు ఎందుకు చెప్పారని మండిపడ్డారు. వారెవరో చెబితే వారిపైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రధాని మోదీ మీటింగ్‌లో సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండాలని మాత్రమే చెప్పారని పేర్కొన్నారు. తెలంగాణలో బీజేపీని మరింతగా బలోపేతం చేయాలని మోదీ కోరారని అన్నారు. దక్షిణాది నుంచి ఇప్పటివరకు ఇద్దరు ఉపరాష్ట్రపతులు అయ్యారని కిషన్‌రెడ్డి గుర్తుచేశారు.
రాహుల్‌గాంధీపై కిషన్‌రెడ్డి షాకింగ్ కామెంట్స్..
ఏఐసీసీ అగ్రనేత రాహుల్‌గాంధీపై కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి షాకింగ్ కామెంట్స్ చేశారు. ప్రధాని మోదీపై రాహుల్‌గాంధీ చేసిన వ్యాఖ్యలు సరికాదని అన్నారు. ఆయన అనైతికంగా మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. ప్రధాని మోదీ స్థాయిని తగ్గించేలా రాహుల్ వ్యాఖ్యలు ఉన్నాయని మండిపడ్డారు. రాహుల్‌గాంధీ విపక్ష నేతగా ఉండటం దురదృష్టకరమని కిషన్‌రెడ్డి విమర్శించారు.
ఇవి కూడా చదవండి..
వార్డుల డీ లిమిటేషన్‌పై జీహెచ్ఎంసీ కౌన్సిల్ చర్చ
హైదరాబాద్‌లో మరో హత్య.. భయాందోళనలో ప్రజలు
Read Latest Telangana News And Telugu News