GHMC Council Meeting: వార్డుల డీ లిమిటేషన్‌పై జీహెచ్ఎంసీ కౌన్సిల్ చర్చ
ABN , Publish Date - Dec 16 , 2025 | 10:46 AM
జీహెచ్ఎంసీ ప్రత్యేక కౌన్సిల్ మంగళవారం సమావేశమైంది. ఈ సభలో పలు కీలక అంశాలపై చర్చిస్తున్నారు. ప్రధానంగా వార్డుల డీ లిమిటేషన్‌పై చర్చ జరుగుతోంది.
హైదరాబాద్, డిసెంబరు16 (ఆంధ్రజ్యోతి): జీహెచ్ఎంసీ ప్రత్యేక కౌన్సిల్ (GHMC Special Council Meeting) ఇవాళ(మంగళవారం) సమావేశమైంది. ఈ సభలో పలు కీలక అంశాలపై చర్చిస్తున్నారు. ప్రధానంగా వార్డుల డీ లిమిటేషన్‌పై చర్చ జరుగుతోంది. ఈ క్రమంలోనే వార్డుల డీ లిమిటేషన్ ప్రిలిమినరీ నోటిఫికేషన్‌ను సభలో ప్రవేశపెట్టనున్నారు అధికారులు.
ఈ సభలో వార్డుల డీ లిమిటేషన్‌పై నగర కార్పొరేటర్లతో పాటు ఎక్స్ అఫీషియో సభ్యులు తమ అభ్యంతరాలు, సలహాలు తెలపనున్నారు. ఇప్పటికే వార్డుల విభజనపై తమ అభ్యంతరాలను జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్‌కు అన్ని పార్టీల నేతలు వినతిపత్రం అందజేశారు. వార్డుల విభజన, హద్దుల మ్యాప్ ఇవ్వట్లేదని కార్పొరేటర్లు అన్నారు. ఏ ప్రాతిపదికన వార్డుల విభజన చేశారో తెలియడం లేదని కార్పొరేటర్లు తెలిపారు.
వార్డుల జనాభాలో భారీ వ్యత్యాసం ఉందని నేతలు చెప్పుకొచ్చారు. కార్పొరేటర్లు, ఎక్స్ అఫీషియో సభ్యుల అభ్యంతరాలు, సూచనలు పరిగణనలోకి తీసుకుని ఫైనల్ నోటిఫికేషన్ విడుదల చేస్తామని జీహెచ్ఎంసీ అధికారులు వివరించారు. ఈ నేపథ్యంలో ప్రత్యేక కౌన్సిల్ సమావేశం జరగుతుండటంతో.. జీహెచ్ఎంసీ వద్ద పోలీసులు భారీగా భద్రత పెంచారు. ఈ క్రమంలోనే వార్డుల విభజనపై బీజేపీ, బీఆర్ఎస్, మజ్లిస్ కార్పొరేటర్లు ఆందోళనకు పిలుపునిచ్చారు. ఎలాంటి ఉద్రిక్తత పరిస్థితులు నెలకొనకుండా పోలీసులు చర్యలు చేపట్టారు.
ఇవి కూడా చదవండి..
వ్యక్తిపైకి దూసుకెళ్లిన కారు.. అమాంతం గాల్లోకి ఎగిరి
హైదరాబాద్‌లో మరో హత్య.. భయాందోళనలో ప్రజలు
Read Latest Telangana News And Telugu News