Mann Ki Baat ON PM Modi: హైదరాబాద్ విమోచన దినోత్సవం ముందు ప్రధాని మోదీ సందేశం
ABN , Publish Date - Aug 31 , 2025 | 06:27 PM
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ‘మన్ కీ బాత్’ కార్యక్రమంలో హైదరాబాద్ అవశ్యకత గురించి చెప్పారని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ మాటలను గుర్తు చేశారని చెప్పుకొచ్చారు. హైదరాబాద్ విమోచన దినోత్సవం సమీపిస్తున్న తరుణంలో ప్రధాని మోదీ ‘మన్ కీ బాత్’ ద్వారా హైదరాబాద్ ప్రజలు చేసిన నిస్వార్థ త్యాగాలను గుర్తుచేశారని కిషన్‌రెడ్డి పేర్కొన్నారు.
హైదరాబాద్, ఆగస్టు31, (ఆంధ్రజ్యోతి): ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Narendra Modi) ఇవాళ(ఆదివారం) ‘మన్ కీ బాత్’ (Mann Ki Baat) కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారాన్ని బోరబండ సైట్–3, ఎన్టీఆర్ విగ్రహం వద్ద నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి గంగాపురం కిషన్‌రెడ్డి (Kishan Reddy) హాజరయ్యారు. ఈ సందర్భంగా కిషన్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. హైదరాబాద్ విమోచన దినోత్సవం సమీపిస్తున్న తరుణంలో.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ‘మన్ కీ బాత్’ ద్వారా హైదరాబాద్ ప్రజలు చేసిన నిస్వార్థ త్యాగాలను గుర్తుచేశారని.. అలాగే భారతదేశ ఉక్కు మనిషి సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ నేతృత్వంలోని 'ఆపరేషన్ పోలో'ను ప్రశంసించారని తెలిపారు కిషన్‌రెడ్డి.
హైదరాబాద్ ప్రజల నిస్వార్థ త్యాగాలను మోదీ గుర్తుచేశారు: కిషన్‌రెడ్డి

ఇది నిజాం పాలన నుంచి హైదరాబాద్ విముక్తికి దారితీసిందని కిషన్‌రెడ్డి చెప్పుకొచ్చారు. స్వాతంత్య్రం రావడానికి హైదరాబాద్ 1948 సెప్టెంబర్ 17వ తేదీ వరకు ఎలా వేచి ఉండాల్సి వచ్చిందో కూడా ప్రధానమంత్రి మోదీ వివరించారని తెలిపారు. ఈ క్రమంలో హైదరాబాద్ అవశ్యకత గురించి కూడా ప్రధాని మోదీ చెప్పారని అన్నారు. సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ మాటలను గుర్తు చేశారని చెప్పుకొచ్చారు. హైదరాబాద్ విమోచన దినోత్సవం సమీపిస్తున్న తరుణంలో ప్రధాని మోదీ ‘మన్ కీ బాత్’ ద్వారా హైదరాబాద్ ప్రజలు చేసిన నిస్వార్థ త్యాగాలను గుర్తుచేశారని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
బీజేపీ హక్కులను కొల్లగొడుతోంది.. మోదీ ప్రభుత్వంపై సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు
కాంగ్రెస్‌లో ఉంటే.. కిరాయి ఇంట్లో ఉన్న ఫీలింగ్ ఉంది..
For More TG News And Telugu News