Share News

Supreme Court: తెలంగాణ స్థానిక కోటాపై సుప్రీంకోర్టులో కీలక విచారణ

ABN , Publish Date - Aug 05 , 2025 | 12:48 PM

తెలంగాణ స్థానిక కోటాపై సుప్రీంకోర్టులో మంగళవారం కీలక విచారణ కొనసాగుతోంది. స్థానికులు నాలుగేళ్లు వరుసగా తెలంగాణలో చదవకపోయిన స్థానిక కోటా వర్తిస్తుందన్న తెలంగాణ హైకోర్టు తీర్పుపై రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది.

 Supreme Court: తెలంగాణ స్థానిక కోటాపై సుప్రీంకోర్టులో కీలక విచారణ
Supreme Court

ఢిల్లీ, ఆగస్టు 5 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ స్థానిక కోటాపై (Telangana Local Quota) సుప్రీంకోర్టులో (Supreme Court) ఇవాళ(మంగళవారం) కీలక విచారణ కొనసాగుతోంది. స్థానికులు నాలుగేళ్లు వరుసగా తెలంగాణలో చదవకపోయిన స్థానిక కోటా వర్తిస్తుందన్న తెలంగాణ హైకోర్టు తీర్పుపై రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. 10వ, 11వ తరగతులకే బయటకు వెళ్లిన విద్యార్థులకు అన్యాయం చేయరాదని సుప్రీంకోర్టు సీజేఐ బీఆర్ గవాయ్ వ్యాఖ్యానించారు.


దుబాయ్ లాంటి ప్రాంతాలకు ఇంటర్ చదువుకోడానికి వెళ్లిన విద్యార్థులకు కోటా వర్తించదంటే ఎలా అని సీజేఐ ప్రశ్నించారు. విద్యార్థి తెలంగాణలో పుట్టి, చదివితే .. 2 సంవత్సరాలు బయట చదివినంత మాత్రాన తెలంగాణ కోటా వర్తించదంటే ఎలా అని నిలదీశారు. ఇతర రాష్ట్రాల విద్యార్థులు ఎటూ స్థానిక కోటా కిందకు రారని స్పష్టం చేశారు. నాలుగు సంవత్సరాల చదువు లేదా నివాసం ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం స్థానికత ఖరారు చేసిందని తెలంగాణ ప్రభుత్వం తరఫున న్యాయవాది సింఘ్వీ న్యాయస్థానానికి వివరించారు. 2024లో తీసుకువచ్చిన నిబంధనను 2028కి వర్తింపజేస్తే సరిపోతుందని సీజేఐ పేర్కొన్నారు. స్థానికత నిబంధనల కారణంగా తెలంగాణ విద్యార్థుల హక్కులకు అన్యాయం జరగకూడదని సీజేఐ బీఆర్ గవాయ్ అభిప్రాయం వ్యక్తం చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి

పార్లమెంట్ ఆవరణలో తెలంగాణ కాంగ్రెస్ ఎంపీల ఆందోళన

కేసీఆర్ ఇచ్చిన టాస్క్‌ను పూర్తి చేశా.. గువ్వాల బాలరాజు షాకింగ్ కామెంట్స్

Read latest Telangana News And Telugu News

Updated Date - Aug 05 , 2025 | 01:01 PM