Jagga Reddy: సీఎం పదవిపై జగ్గారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు
ABN , Publish Date - Jun 26 , 2025 | 02:56 PM
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకి టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. కవిత ప్రతి విషయాన్ని రాద్దాంతం చేస్తోందని మండిపడ్డారు. కవిత బీఆర్ఎస్‌లో ఉంటే ఏంటి.. బయటకు వస్తే ఏంటని ప్రశ్నించారు.

హైదరాబాద్: తెలంగాణ సీఎం పదవిపై టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి (Jagga Reddy) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ మూడేళ్లు రేవంత్‌రెడ్డే సీఎంగా ఉంటారని స్పష్టం చేశారు. వచ్చే ఐదేళ్లు మళ్లీ ముఖ్యమంత్రి కావడానికి రేవంత్‌రెడ్డి ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. తొమ్మిదేళ్ల తర్వాత సీఎం కావడానికి తాను ప్రయత్నం చేస్తానని తెలిపారు. రేవంత్‌రెడ్డి సీఎంగా దిగిపోయాక తాను ముఖ్యమంత్రిని కావడానికి ప్రయత్నం చేస్తానని అన్నారు. ఆ క్రమంలో తన అప్లికేషన్ ప్రజల దగ్గర పెడుతానని చెప్పుకొచ్చారు. ఇవాళ(గురువారం) గాంధీభవన్‌లో జగ్గారెడ్డి మీడియాతో మాట్లాడారు.
కవితకి జగ్గారెడ్డి స్ట్రాంగ్ కౌంటర్
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకి జగ్గారెడ్డి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. కవిత ప్రతి విషయాన్ని రాద్దాంతం చేస్తోందని మండిపడ్డారు. కవిత బీఆర్ఎస్‌లో ఉంటే ఏంటి.. బయటకు వస్తే ఏంటని ప్రశ్నించారు. ఆమె మాటలు దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉన్నాయని ఎద్దేవా చేశారు. తండ్రి వారసత్వం కొడుకుకే ఉంటుందని.. ఒకవేళ కొడుకు లేకపోతే కూతురికి వచ్చే అవకాశం ఉంటుందని చెప్పారు జగ్గారెడ్డి.
తాము స్పందించే అంతటి లీడర్ కవిత కాదనే తమ అభిప్రాయమని జగ్గారెడ్డి అన్నారు. కవిత పెద్ద పెద్ద మాటలు ఎందుకు మాట్లాడుతుందో అర్థం కావడం లేదని చెప్పారు. కేసీఆర్, రేవంత్‌రెడ్డి సమానమైన ప్రాధాన్యం ఉన్న నేతలని చెప్పుకొచ్చారు. రాజకీయంగా ఒకరిని మరొకరు విమర్శించుకుంటే అర్థముందని అన్నారు. కవిత ఎందుకు అనవసరంగా తమ గురించి మాట్లాడుతోందని ప్రశ్నించారు. హాయిగా బతుకమ్మ ఆడుకోకుండా కవితకి ఎందుకు ఈ పంచాయితీ అని నిలదీశారు. లిక్కర్ స్కాంలో పైసలు పెట్టడానికి కవితకి ఇన్ని వందల కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయని జగ్గారెడ్డి ప్రశ్నల వర్షం కురిపించారు.
ఇవి కూడా చదవండి:
ఐటీ ఉద్యోగి ఆత్మహత్య కేసులో కీలక విషయాలు..
జలహారతి కార్పొరేషన్ లిమిటెడ్ ఏర్పాటు చేసిన ప్రభుత్వం..
Read Latest Telangana News and National News