EC key Decision ON Jubilee Hills Bye Poll: జూబ్లీహిల్స్ బై ఎలక్షన్.. ఎన్నికల కమిషన్ మరో కీలక నిర్ణయం
ABN , Publish Date - Aug 25 , 2025 | 07:40 PM
జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ పోలింగ్ స్టేషన్ల రేషనలైజేషన్‌పై రాజకీయ పార్టీలతో జిల్లా ఎన్నికల అధికారి కర్ణన్ ఇవాళ(సోమవారం) సమావేశం నిర్వహించారు. నియోజకవర్గంలో కొత్తగా 79 పోలింగ్ స్టేషన్ల ప్రతిపాదనలు చేసినట్లు తెలిపారు. గతంలో 329 ఉన్న పోలింగ్ స్టేషన్లను 408కి పెంచనున్నామని ఆర్వీ కర్ణన్ వివరించారు.
హైదరాబాద్, ఆగస్టు25 (ఆంధ్రజ్యోతి): జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ (Jubilee Hills Bye Election) పోలింగ్ స్టేషన్ల రేషనలైజేషన్‌పై రాజకీయ పార్టీలతో జిల్లా ఎన్నికల అధికారి కర్ణన్ (Election Officer Karnaan) ఇవాళ(సోమవారం) సమావేశం నిర్వహించారు. నియోజకవర్గంలో కొత్తగా 79 పోలింగ్ స్టేషన్ల ప్రతిపాదనలు చేసినట్లు తెలిపారు. గతంలో 329 ఉన్న పోలింగ్ స్టేషన్లను 408కి పెంచనున్నామని ఆర్వీ కర్ణన్ వివరించారు.
గతంలో 132 పోలింగ్ లొకేషన్‌లను ప్రస్తుతం 13కి పెంచనున్నామని ఆర్వీ కర్ణన్ వెల్లడించారు. వీటిపైన ఏవైనా అభ్యంతరాలుంటే రేపు(మంగళవారం) సాయంత్రం లోపు తెలపాలని రాజకీయ పార్టీల ప్రతినిధులను జిల్లా ఎన్నికల అధికారి కోరారు. రేషనలైజేషన్ రిపోర్ట్‌ను ఈనెల (ఆగస్టు) 28వ తేదీలోపు కేంద్ర ఎన్నికల సంఘానికి పంపాలని తెలిపారు. రాజకీయ పార్టీలు వెంటనే బూత్ లెవెల్ ఏజెంట్ల జాబితా సమర్పించాలని కోరారు. నియోజకవర్గానికి జనవరి నుంచి ఆగస్టు 15వ తేదీ వరకు 19 వేల 237 దరఖాస్తులు రాగా.. 3 వేల 767 దరఖాస్తులు రిజెక్ట్ చేసినట్లు ఆర్వీ కర్ణన్ తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి..
హైదరాబాద్‌లో దారుణం.. యజమానిపై అమానుష దాడి
వారిద్దరూ రాహుల్‌ని ఆటలో అరటిపండుగా మార్చారు: కేటీఆర్ వ్యంగ్యాస్త్రాలు
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి.