Share News

Police Alert On Cyber Frauds: సైబర్ మోసాలపై అలర్ట్.. ప్రజలకు కీలక సూచనలు..

ABN , Publish Date - Oct 15 , 2025 | 08:40 PM

ఆన్‌లైన్ మోసాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు సూచించారు. దీపావళితోపాటు రాబోయే పండుగల సందర్భంగా ఆన్ లైన్‌లో షాపింగ్ చేసే వాళ్లు అప్రమత్తంగా ఉండాలని దిశానిర్దేశం చేశారు.

Police Alert On Cyber Frauds: సైబర్ మోసాలపై అలర్ట్.. ప్రజలకు కీలక సూచనలు..
Police Alert On Cyber Frauds

హైదరాబాద్, అక్టోబరు 15 (ఆంధ్రజ్యోతి): ఆన్‌లైన్ మోసాల (Cyber Frauds)పై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు (Hyderabad Cyber ​​Police) సూచించారు. దీపావళి (Diwali)తో పాటు రాబోయే పండుగల సందర్భంగా ఆన్‌లైన్‌లో షాపింగ్ చేసే వాళ్లు అప్రమత్తంగా ఉండాలని దిశానిర్దేశం చేశారు. ఈ మేరకు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు ఓ ప్రకటన విడుదల చేశారు. ఫేక్ ఈ–కామర్స్ వెబ్‌సైట్లు, మాల్వేర్ APK ఫైళ్లు, ఫిషింగ్ లింకులు, సోషల్ మీడియా ప్రకటనలపై అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు.


ఫెస్టివల్ డిస్కౌంట్ల పేరుతో బ్యాంక్ వివరాలు, క్రెడిట్ కార్డ్ సమాచారంతో మోసాలకు సైబర్ కేటుగాళ్లు పాల్పడుతున్నారని తెలిపారు. వాట్సాప్, SMS, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, టెలిగ్రామ్ ద్వారా ఫేక్ షాపింగ్ లింక్‌లపై జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. నమ్మకమైన ఈ – కామర్స్ వెబ్‌సైట్లలో మాత్రమే షాపింగ్ చేయాలని విజ్ఞప్తి చేశారు. అన్ని ఖాతాలకు 2-ఫ్యాక్టర్ ఆథెంటికేషన్ (2FA) ఆప్షన్ ఏర్పాటు చేసుకోవాలని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు సూచించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

మంత్రుల మధ్య వివాదాలు లేవు: శ్రీధర్ బాబు

మంత్రి శ్రీధర్‌బాబుకు అరుదైన గౌరవం

Read Latest Telangana News And Telugu News

Updated Date - Oct 15 , 2025 | 09:02 PM