Sridhar Babu On Melbourne Conference: మంత్రి శ్రీధర్‌బాబుకు అరుదైన గౌరవం
ABN , Publish Date - Oct 15 , 2025 | 07:40 PM
తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబుకి అరుదైన గౌరవం దక్కింది. మెల్‌బోర్న్‌లో ఆస్‌బయోటెక్ ఇంటర్నేషన్ కాన్ఫరెన్స్‌లో కీలకోపన్యాసం చేయనున్నారు మంత్రి శ్రీధర్‌బాబు.
హైదరాబాద్, అక్టోబరు 15 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు (Minister Sridhar Babu)కి అరుదైన గౌరవం దక్కింది. మెల్‌బోర్న్ (Melbourne)లో ఆస్‌బయోటెక్ ఇంటర్నేషన్ కాన్ఫరెన్స్ (As Bio Tech International Conference)లో కీలకోపన్యాసం చేయనున్నారు మంత్రి శ్రీధర్‌బాబు. ఆస్ట్రేలియా కాన్సుల్ జనరల్ హిల్లరీ మెక్‌గీచి నుంచి ఆయనకి ప్రత్యేకంగా ఆహ్వానం అందింది.
దేశంలో ఈ గౌరవం దక్కిన ఏకైక మంత్రి శ్రీధర్‌బాబు కావడం గమనార్హం. అయితే, ఈ నెల 21వ తేదీ నుంచి 24వ తేదీ వరకూ ఆస్‌బయోటెక్ ఇంటర్నేషన్ కాన్ఫరెన్స్ జరుగనుంది. కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Govt) అధికారంలోకి వచ్చిన తర్వాత లైఫ్ సైన్సెస్ రంగం సాధించిన డెవలప్‌మెంట్ గురించి వివరించనున్నారు. లైఫ్ సైన్సెస్ రంగంలో రేవంత్‌రెడ్డి ప్రభుత్వం కల్పించిన అవకాశాలను తెలపనున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
మంత్రుల మధ్య వివాదాలు లేవు: శ్రీధర్ బాబు
బీసీల వాదన వినకుండా కోర్టు ఏకపక్షంగా స్టే ఇచ్చింది: ఆర్.కృష్ణయ్య
Read Latest Telangana News And Telugu News