Rythu Bharosa scheme: రైతు భరోసా డబ్బులు పడేది అప్పుడే..
ABN , Publish Date - Jan 26 , 2025 | 05:35 PM
Rythu Bharosa scheme: కాంగ్రెస్ హామీల్లో భాగంగా సీఎం రేవంత్‌రెడ్డి ఆదివారం నాడు నారాయణపేట జిల్లాలో నాలుగు పథకాలను ప్రారంభించారు. అయితే రైతుభరోసా సాయం ఎప్పుడు అందుతుందోనని రైతులు ఆందోళన చెంతున్నారు. ఈ డబ్బులు త్వరగా పడితే బాగుంటుందని అన్నదాతలు అనుకుంటున్నారు.
హైదరాబాద్: ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారెంటీలను కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్కొక్కటిగా అమలు చేస్తోంది. ఇందులో భాగంగానే నారాయణపేట జిల్లా కోస్గి మండలం చంద్రవంచలో ఇవాళ(ఆదివారం) 4 పథకాలను సీఎం రేవంత్‌రెడ్డి ప్రారంభించారు. రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇళ్లు, రేషన్ కార్డుల పంపిణీని ప్రారంభించారు. లబ్ధిదారులకు చెక్కులను సీఎం రేవంత్‌రెడ్డి అందజేశారు. అయితే రైతుభరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసాపై లబ్ధిదారుల్లో కొంత ఆందోళన చెందుతున్నారు. రైతు భరోసాకు సంబంధించిన డబ్బులు ఎప్పుడు తమ ఖాతాల్లో పడుతాయోనని రైతులు అయోమయంలో ఉన్నారు. ఈ డబ్బుల కోసం అన్నదాతలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నగదు త్వరగా అందితే పెట్టుబడి కోసం తెచ్చిన అప్పులు కొంతమేర తీర్చినట్లు అవుతుందని రైతులు అనుకుంటున్నారు. అయితే అధికారులను రైతులు వివరాలు అడిగితే ఇవాళ అర్ధరాత్రి నుంచి వారి వారి బ్యాంకు ఖాతాల్లో రైతు భరోసా నగదు జమ అవుతుందని అధికారులు అంటున్నారు. రైతులు ఈ డబ్బులపై భారీగా ఆశలు పెట్టుకున్నారు.
రైతు భరోసా ఆలస్యానికి కారణమిదే..
రైతు భరోసా కింద ప్రభుత్వం ప్రకటించినట్లుగానే ఎకరానికి రూ. 6వేలు జమఅవుతాయి. దీంతో పాటు భూమి లేని వ్యవసాయ ఆధారిత కుటుంబాలకు ఈ సాయం అందనుంది. ఇవాళ ఆదివారం బ్యాంకులకు సెలవు కావడంతోనే ఈ సమస్య వచ్చిందని రైతులు చెబుతున్నారు. ఈ రోజు అర్ధరాత్రి 12 గంటల తర్వాత రైతుల బ్యాంకు ఖాతాల్లో నగదు జమకానుంది. ఈ మేరకు ప్రభుత్వం ప్రకటించింది. దీంతో రైతులు కొంత ఉపశమనంగా ఉన్నారు. అయితే గతంలో లాగానే మొదటి రోజు ఎకరంలోపు, ఆ తర్వాత ఎకరంన్నర, రెండెకరాలు ఇలా విడతల వారీగా 'ఈ కుబేర్' పద్ధతిలో రైతుల ఖాతాల్లో నగదు జమ కానుందని వ్యవసాయ అధికారులు చెప్పారు.
జనవరి వరకే గడువు..
రైతులు కొత్తగా పట్టాదారు పాసు పుస్తకాలు పొందడం, గతంలో బ్యాంక్ అకౌంట్ నంబరు, ఐఎఫ్ఎస్సీ కోడ్ తప్పుగా పడటం, బ్యాంకు ఖాతాలు సరిగా లేకపోవడం వంటి తదితర సమస్యల పరిష్కారానికి కావాల్సిన పత్రాలను క్లస్టర్ వ్యవసాయ విస్తరణాధికారులను ఇవ్వడానికి జనవరి వరకు మాత్రమే గడువు ఉంది. రైతులు అందజేసిన పత్రాలను పరిశీలించిన తర్వాత అర్హులకు పెట్టుబడి సహాయం అందజేస్తామని వ్యవసాయ అధికారులు స్పష్టం చేశారు.
అధికారుల సర్వే.. రైతుల ఆందోళన..
కాగా తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల గ్రామాల వారీగా అధికారులు సర్వే నిర్వహించారు. ఈ సర్వేలో సాగుకు అమోదయోగ్యం కాని భూముల విస్తీర్ణం వివరాలను 'ఈ కుబేర్' పోర్టల్ నుంచి తొలగిస్తున్నారు. తహసీల్దార్లు, సీసీఎల్ఏకు సంబంధించిన జాబితాల్లోనూ ఈ వివరాలు నమోదు చేస్తున్నారు. రైతులు సేద్యం చేయకుండా ఉంచారని మాత్రమే ఆయా జాబితాల్లో పొందుపరుస్తున్నారు. దీనివల్ల రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అధికారులు చెబుతున్నారు. రైతు భరోసాలో భాగంగానే ఈ జాబితాలో నమోదు చేస్తున్నట్లు వ్యవసాయ అధికారులు అంటున్నారు. ఈ జాబితా వల్ల పట్టా భూముల వివరాల్లో ఎలాంటి తేడాలు ఉండవని స్పష్టం చేశారు. ఒకే సర్వే నంబరులో కొంత సాగుభూమి, మరికొంత సాగు చేయని భూమిగా నమోదు చేస్తారు. ఇలా నమోదు చేసిన తర్వాత రెండు నుంచి మూడు రోజుల్లో రైతు భరోసా సాయం అందజేయనున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి
CM Revanth Reddy: మమ్మల్ని అవమానిస్తారా.. కేంద్రంపై సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం..
Karimnagar: మళ్లీ హల్‌చల్ చేసిన నాగసాధు అఘోరీ.. ఈసారి ఏం చేసిందంటే..
Kandukuri Venkatesh: కష్టపడి కాన్వాస్ పెయింటింగ్‌ను చిత్రీకరించాను.
Read Latest Telangana News and Telugu News