Share News

DGP Jitender on Social Media: సోషల్ మీడియాలో ఆ పోస్టులు పెడితే కఠిన చర్యలు: డీజీపీ జితేందర్

ABN , Publish Date - Sep 25 , 2025 | 12:41 PM

సోషల్ మీడియాలో సైబర్ నేరాలకు పాల్పడుతున్న వారికి తెలంగాణ డీజీపీ జితేందర్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు డీజీపీ. సైబర్ నేరాలకు పాల్పడుతున్న వారిపై రౌడీషీట్లు, హిస్టరీ షీట్లు, సస్పెక్ట్ షీట్లు తెరవాలని డీజీపీ జితేందర్ ఆదేశించారు.

DGP Jitender on Social Media: సోషల్ మీడియాలో ఆ పోస్టులు పెడితే కఠిన చర్యలు: డీజీపీ జితేందర్
DGP Jitender on Social Media

హైదరాబాద్, సెప్టెంబరు 25 (ఆంధ్రజ్యోతి): సోషల్ మీడియా(Social Media Posts) లో సైబర్ నేరాలకు (Cyber Crime) పాల్పడుతున్న వారికి తెలంగాణ డీజీపీ జితేందర్ (DGP Jitender) స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు డీజీపీ. సైబర్ నేరాలకు పాల్పడుతున్న వారిపై రౌడీషీట్లు, హిస్టరీ షీట్లు, సస్పెక్ట్ షీట్లు తెరవాలని ఆదేశించారు. ఈ మేరకు తెలంగాణలోని అన్ని పోలీస్ స్టేషన్లకు ఉత్తర్వులు జారీ చేశారు డీజీపీ జితేందర్.


కాగా, ఇటీవల సోషల్ మీడియాలో సైబర్ నేరాలు పెరిగిపోతున్న విషయం తెలిసిందే. ఎంతోమంది అమాయకులు వీటి బారీన పడుతున్నారు. ఈ క్రమంలో తెలంగాణ పోలీసులు సైబర్ నేరాలపై ఉక్కుపాదం మోపుతున్నారు. ఈ నేపథ్యంలోనే సైబర్ నేరాలకు పాల్పడే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదల పెట్టవద్దని డీజీపీ జితేందర్ ఆదేశించారు. ఇలా చేస్తే సైబర్ నేరాలకు అడ్డుకట్టు వేయవచ్చని పోలీసులు భావిస్తున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

నేటి అలంకారం శ్రీ కాత్యాయనీ దేవి

పార్టీ పరిశీలకులతో అగ్రనేతలు భేటీ

Read Latest Telangana News And Telugu News

Updated Date - Sep 25 , 2025 | 01:29 PM