Congress Leaders meet AICC Observers: పార్టీ పరిశీలకులతో అగ్రనేతలు భేటీ
ABN , Publish Date - Sep 25 , 2025 | 09:25 AM
ఎన్నికల్లో సత్తా చాటేందుకు కాంగ్రెస్ పార్టీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. అందులోభాగం పార్టీ పరిశీలకులతో అగ్రనేతలు నేడు సమావేశం కానున్నారు.
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 25: కాంగ్రెస్‌ని బలోపేతం చేసి.. ఎన్నికల్లో సత్తా చాటాలని ఆ పార్టీ అగ్రనాయకత్వం వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తుంది. అందులో భాగంగా ఏఐసీసీ పరిశీలకులతో పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖార్గేతోపాటు అగ్రనేత రాహుల్ గాంధీ సమావేశం కానున్నారు. డీసీసీ అధ్యక్షుల ఎంపిక కోసం 22 మంది పరిశీలకులతో వారు భేటీ అవనున్నారు. ఈ భేటీకి తెలంగాణ రాష్ట్ర పార్టీ వ్యవహారాల బాధ్యురాలు మీనాక్షి నటరాజన్‌తోపాటు టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ హాజరుకానున్నారు.
మరో వైపు.. బిహార్ రాజధాని పాట్నా వేదికగా బుధవారం కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పలు కీలక తీర్మానాలు చేసింది. అలాగే మోదీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించింది. భవిష్యత్తులో ఎన్నికల్లో గెలుపు కోసం చేపట్టవలసిన చర్యలపై చర్చించింది. ఈ సమావేశానికి కాంగ్రెస్ పార్టీ పాలిత రాష్ట్రాల సీఎంలు, పీసీసీ అధ్యక్షులు, కీలక నేతలతోపాటు ఆ పార్టీ అగ్రనేతలు సైతం హాజరయ్యారు.
ఇక మరికొద్ది రోజుల్లో బిహార్ అసెంబ్లీకి ఎన్నికల నగారా మోగనుంది. ఈ రాష్ట్రంలో తన సత్తా చాటాలని ఆ పార్టీ భావిస్తోంది. ఆ క్రమంలో ఇప్పటికే ఆ రాష్ట్రంలో 15 రోజుల పాటు ఎంపీ రాహుల్ గాంధీ యాత్ర చేపట్టి పార్టీ కేడర్‌లో ఉత్సాహాన్ని నింపారు. ఇంకోవైపు ఓట్ల చోరీ అంశాన్ని ప్రజల్లోకి ఆయన బలంగా తీసుకు వెళ్తున్నారు. తద్వారా మోదీ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లి.. ఎండగట్టేందుకు ఎంత ప్రయత్నం చేయాల్లో.. అంతా రాహుల్ గాంధీ చేస్తున్నారన్న విషయం అందరికి తెలిసిందే.
ఈ వార్తలు కూడా చదవండి..
బాలికలపై లైంగిక దాడి.. నిందితులు అరెస్ట్
Read Latest National News And Telugu News