Minor Girls: బాలికలపై లైంగిక దాడి.. నిందితులు అరెస్ట్
ABN , Publish Date - Sep 25 , 2025 | 08:19 AM
ముగ్గురు బాలికలపై లైంగిక దాడి జరిగింది. ఈ ఘటనలో నిందితులను పోలీసులు అరెస్ట్ చేసి.. వారిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు.
హైదరాబాద్, సెప్టెంబర్ 25: హైదరాబాద్‌లోని అల్వాల్ పోలీస్‌స్టేషన్ పరిధిలో దారుణం చోటు చేసుకొంది. విహారయాత్ర పేరుతో తొమ్మిదో తరగతి చదువుతున్న విద్యార్థులను యాదగిరిగుట్టకు తీసుకు వెళ్లి.. వారిపై ముగ్గురు యువకులు లైంగిక దాడికి పాల్పడ్డారు. అనంతరం ఆ బాలికలను తార్నాకలో విడిచి వెళ్లిపోయారు. జరిగిన ఘటనను ఆ బాలికలు.. తమ తల్లిదండ్రులకు తెలిపారు. దీంతో వారు పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అందులో భాగంగా ఆ ముగ్గురు యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
పోలీసుల కథనం ప్రకారం.. అల్వాల్ ప్రాంతానికి చెందిన ముగ్గురు బాలికలు ఒకే పాఠశాలలో చదువుకుంటున్నారు. అయితే సెప్టెంబర్ 20వ తేదీన స్కూల్లో బతుకమ్మ వేడుకలున్నాయని వారు ఇంట్లో చెప్పి.. బయటకు వెళ్లారు. ఆ క్రమంలో మాణికేశ్వర్ నగర్‌కు చెందిన జీహెచ్ఎంసీ కాంట్రాక్ట్ ఉద్యోగి మధుతో వీరికి పరిచయం ఏర్పడింది. ఈ బాలికలు యాదగిరిగుట్టకు వెళ్తున్నట్లు.. వారి మాటల ద్వారా మధు తెలుసుకున్నాడు.
అనంతరం అతడు స్నేహితులు వంశీ అరవింద్, నీరజ్‌లను ఫోన్ చేసి పిలిచాడు. తాము కూడా యాదగిరిగుట్టకు వెళ్తున్నామని తెలిపారు. దీంతో ఆరుగురు యాదగిరిగుట్టకు వెళ్లారు. దేవుని దర్శనం అనంతరం స్థానిక లాడ్జిలో ఈ యువకులు మూడు గదులు అద్దెకు తీసుకున్నారు. ఆ తర్వాత ఆ యువతులపై యువకులు అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ మరునాడు వీరిని హైదరాబాద్‌లోని తార్నాకలో దింపేశారు.
మరోవైపు.. అప్పటికే తమ కుమార్తెలు కనిపించడం లేదంటూ అల్వాల్ పోలీసులను వారి తల్లిదండ్రులు ఆశ్రయించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అయితే ఇంటి నుంచి వెళ్లి మరునాడు తిరిగి రావడంతో.. ఆ బాలికలను వారి తల్లిదండ్రులు ప్రశ్నించారు. దీంతో జరిగిన విషయాన్ని తల్లిదండ్రులకు బాలికలు తెలిపారు. దాంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అందులో భాగంగా నిందితులపై పోక్సో కేసు నమోదు చేసి.. వారిని అరెస్ట్ చేశారు. వైద్య పరీక్షల కోసం బాలికలను ఆసుపత్రికి తరలించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
చేపా చేపా ఎందుకు పెరగట్లే.. మత్స్యకారుల ఆవేదన
ఆర్టీసీ కీలక నిర్ణయం.. కొత్తగా 10 డిపోలు
Read Latest Telangana News and National News