Share News

TGSRTC: ఆర్టీసీ కీలక నిర్ణయం.. కొత్తగా 10 డిపోలు

ABN , Publish Date - Sep 25 , 2025 | 07:52 AM

కొత్తగా 10 ఆర్టీసీ డిపోల ఔటర్‌రింగ్‌ రోడ్డు లోపల శివారు ప్రాంతాల్లో అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ఆర్టీసీ సన్నద్ధం అవుతోంది. మేడ్చల్‌, రంగారెడి, సంగారెడ్డి జిల్లాల్లో కొత్త డిపోలు ఏర్పాటుకు స్థలాలు కేటాయించాలంటూ ఇప్పటికే ప్రభుత్వానికి నివేదించింది.

TGSRTC: ఆర్టీసీ కీలక నిర్ణయం.. కొత్తగా 10  డిపోలు

- రంగారెడ్డి, మేడ్చల్‌, సంగారెడ్డి జిల్లాల్లో స్థలాల కోసం నివేదన

- రెండేళ్లలో ఎలక్ర్టిక్‌ బస్సులు నడపాలన్నదే లక్ష్యం

హైదరాబాద్‌ సిటీ: కొత్తగా 10 ఆర్టీసీ డిపోల ఔటర్‌రింగ్‌ రోడ్డు లోపల శివారు ప్రాంతాల్లో అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ఆర్టీసీ సన్నద్ధం అవుతోంది. మేడ్చల్‌, రంగారెడి, సంగారెడ్డి(Medchal, Rangareddy, Sangareddy) జిల్లాల్లో కొత్త డిపోలు ఏర్పాటుకు స్థలాలు కేటాయించాలంటూ ఇప్పటికే ప్రభుత్వానికి నివేదించింది. గ్రేటర్‌జోన్‌ పరిధిలో ఆర్టీసీ 3 వేలకు పైగా బస్సులు నడుపుతుంటే అందులో 2700 డీజిల్‌ బస్సులు ఉన్నాయి. వచ్చే రెండేళ్లలో గ్రేటర్‌లో కేవలం ఎలక్ట్రిక్ బస్సులు మాతమ్రే నడపాలని ప్రభుత్వ ఆదేశాలున్నాయి.


city3.jpg

2 వేల ఎలక్ర్టిక్‌ బస్సులు కేంద్ర ప్రభుత్వం పీఎం ఈ-డ్రైవ్‌ కింద మంజూరు చేయడంతో కొత్త డిపోలు, ఈవీ చార్జింగ్‌ స్టేషన్ల ఏర్పాటుపై ఆర్టీసీ అధికారులు దృష్టి సారించారు. శామీర్‌పేట, పెద్దఅంబర్‌పేట, తుక్కుగూడ, ఘట్‌కేసర్‌, కీసర, దుండిగల్‌, పటాన్‌చెరు(Thukkuguda, Ghatkesar, Keesara, Dundigal, Patancheru), రామచంద్రాపురంతో పాటు జాతీయ రహదారికి సమీపంలో కొత్త డిపోల ఏర్పాటుకు స్థలాలు కేటాయిస్తే ప్రయోజనం చేకూరుతుందని సీనియర్‌ రిటైర్డ్‌ అధికారులు సూచిస్తున్నారు.


city3.3.jpg

జిల్లాలకు ఈవీ బస్సులు

నగరంలోని ప్రధాన బస్టాండ్లయిన ఎంజీబీఎస్‌, జేబీఎస్‏తో పాటు ఉప్పల్‌, దిల్‌సుఖ్‌నగర్‌, బీహెచ్‌ఈఎల్‌ ప్రాంతాల నుంచి జిల్లాలకు ఎలక్ర్టిక్‌ బస్సులను ఆర్టీసీ నడుపుతోంది. భవిష్యత్‌లో ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశాలున్నాయి. ఎలక్ట్రిక్ బస్సులు(Electric buses) విడతల వారీగా వస్తున్న రీత్యా వచ్చే రెండేళ్లలో ఓఆర్‌ఆర్‌ లోపల 8-10 ఎకరాల్లో ఈ కొత్త డిపోలు ఏర్పాటు చేస్తే ఎక్కువ సంఖ్యలో ఈవీ చార్జింగ్‌ పాయింట్లు ఏర్పాటు చేసుకోవచ్చని తలుస్తోంది. జిల్లాల బస్సులు రాత్రి సమయంలో ఆయా డిపోల్లో పెట్టినప్పుడు చార్జింగ్‌ ఫుల్‌ చేసుకునే సౌకర్యాలు కల్పించాలని యత్నిస్తోంది.


ఈ వార్తలు కూడా చదవండి..

బంగారం ధరలో స్వల్ప తగ్గుదల.. ఈ రోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..

మతమేదైనా జాతీయతే ప్రధానం

Read Latest Telangana News and National News

Updated Date - Sep 25 , 2025 | 08:00 AM