Share News

CM Revanth Reddy: చెన్నైకి సీఎం రేవంత్ రెడ్డి

ABN , Publish Date - Sep 25 , 2025 | 08:48 AM

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తమిళనాడులో పర్యటించనున్నారు. అందుకోసం గురువారం మధ్యాహ్నం 1.00 గంటకు ప్రత్యేక విమానంలో ఆయన చెన్నైకు బయలుదేరి వెళ్లనున్నారు.

CM Revanth Reddy: చెన్నైకి సీఎం రేవంత్ రెడ్డి
TG CM Revanth Reddy

హైదరాబాద్, సెప్టెంబర్ 25: తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి చెన్నై వెళ్లనున్నారు. గురువారం మధ్యాహ్నం 1.00 గంటకు శంషాబాద్ ఎయిర్ పోర్టు నుంచి ప్రత్యేక విమానంలో ఆయన చెన్నైకి బయలుదేరి వెళ్లనున్నారు. ఈ రోజు సాయంత్రం తమిళనాడు ప్రభుత్వం మహా విద్య చైతన్య ఉత్సవ్‌ నిర్వహిస్తుంది. ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొనున్నారు.


అనంతరం ఆయన హైదరాబాద్‌కు తిరిగి రానున్నారు. మరో వైపు బుధవారం బిహార్ రాజధాని పాట్నా వేదికగా జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి సైతం పాల్గొన్నారు. అదీకాక.. మరికొద్ది రోజుల్లో బిహార్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. అలాగే వచ్చే ఏడాది తమిళనాడుతోపాటు పలు రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.


ఈ ఎన్నికల్లో ఇండి కూటమిలో ప్రధాన భాగస్వామి అయిన కాంగ్రెస్ పార్టీ తన సత్తా చాటేందుకు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. ఆ క్రమంలో కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకత్వం అచితూచి అడుగులు వేస్తోంది. ఇక తమిళనాడులోని డీఏంకే ప్రభుత్వం సైతం ఇండి కూటమిలో భాగస్వామి అన్న సంగతి అందరికి తెలిసిందే. ఈ నేపథ్యంలో రానున్న ఎన్నికల్లో వరుసగా మరోసారి డీఏంకే గెలుపు కోసం ఇండి కూటమి పావులు కదుపుతుంది.

ఈ వార్తలు కూడా చదవండి..

బాలికలపై లైంగిక దాడి.. నిందితులు అరెస్ట్

ఆర్టీసీ కీలక నిర్ణయం.. కొత్తగా 10 డిపోలు

Read Latest Telangana News and National News

Updated Date - Sep 25 , 2025 | 08:55 AM