Share News

CM Revanth on Delhi: ఢిల్లీలో సీఎం రేవంత్‌రెడ్డి పర్యటన.. షెడ్యూల్ ఇదే

ABN , Publish Date - Sep 18 , 2025 | 08:44 PM

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి గురువారం ఢిల్లీకి చేరుకున్నారు. ఈ మేరకు సీఎం ఢిల్లీ పర్యటన షెడ్యూల్ బిజీబిజీగా ఉండనుంది. ఈ క్రమంలో ముఖ్యమంత్రి కార్యాలయ అధికారులు ఓ ప్రకటన విడుదల చేశారు.

CM Revanth on Delhi: ఢిల్లీలో సీఎం రేవంత్‌రెడ్డి పర్యటన.. షెడ్యూల్ ఇదే
CM Revanth Reddy on Delhi

ఢిల్లీ, సెప్టెంబరు 18 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) ఇవాళ(గురువారం) ఢిల్లీ (Delhi)కి చేరుకున్నారు. ఈ మేరకు సీఎం ఢిల్లీ పర్యటన షెడ్యూల్ బిజీబిజీగా ఉండనుంది. ఈ క్రమంలో ముఖ్యమంత్రి కార్యాలయ అధికారులు ఓ ప్రకటన విడుదల చేశారు. రేపు(శుక్రవారం) ఉదయం పబ్లిక్ అఫైర్స్ ఫోరమ్ ఆఫ్ ఇండియా 12వ వార్షికోత్సవ కార్యక్రమంలో పాల్గొననున్నారు సీఎం రేవంత్‌రెడ్డి.


రేపు(శుక్రవారం) ఉదయం 11 గంటలకు – తాజ్ ప్యాలెస్ హోటల్‌‌లో న్యూజెర్సీ గవర్నర్ ఫిలిప్ డి. మర్ఫీతో భేటీ అవుతారు. ఉదయం 11:30లకు బిజినెస్ స్టాండర్డ్ ఎడిటర్ మోడరేట్ చేసే 12వ వార్షిక ఫోరమ్‌లో ప్రసంగించనున్నారు. అలాగే, మధ్యాహ్నం 12 గంటలకు అమెజాన్, కార్ల్స్ బర్గ్, కార్లైల్, గోద్రెజ్, ఉబర్ కంపెనీల ప్రతినిధులతో పెట్టుబడులపై విడివిడిగా సమావేశమవుతారు. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించనున్నారు. మధ్యాహ్నం 12:30కు వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ అధ్యక్షుడు, సీఈఓ, నార్వే మాజీ యూనియన్ మంత్రి బోర్జ్ బ్రెండేతో ప్రత్యేకంగా సమావేశం కానున్నారు సీఎం రేవంత్‌రెడ్డి.


ఈ వార్తలు కూడా చదవండి..

రీజనల్ రింగ్ రోడ్డు అలైన్‌మెంట్‌‌పై కేటీఆర్ ఏమన్నారంటే...

లోకల్ అభ్యర్థిత్వ వివాదంపై తెలంగాణ హైకోర్టు కీలక తీర్పు

Read Latest Telangana News And Telugu News

Updated Date - Sep 18 , 2025 | 08:49 PM